ADA Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ లో స్కోర్ సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఏరోనాటిక్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) లో పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు.
బెంగళూరు, ఏరోనాటిక్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ADA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్నవారు అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133
బెంగళూరు, ఏరోనాటిక్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. సైంటిస్ట్- బి, సైంటిస్ట్ -సి ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఏరోనాటిక్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీలో వివిధ విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి. ఏరోనాటికల్, మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 21
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ లో పాసైన అభ్యర్థులు అర్హులు అవుతారు. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఏప్రిల్ 21వ తేదీ నాటికి సైంటిస్ట్-సి పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్-బి పోస్టులకు 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు సైంటిస్ట్-బి పోస్టులకు రూ.90,789, సైంటిస్ట్-సి పోస్టులకు రూ.1,08,073 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: https://www.ada.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు సైంటిస్ట్-బి పోస్టులకు రూ.90,789, సైంటిస్ట్-సి పోస్టులకు రూ.1,08,073 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 21
Also Read: TGCAB: తెలంగాణ టీజీసీఏబీలో పోస్టులు.. ఈ అర్హత ఉంటే చాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.97,620