TGCAB Recruitment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సీఏఐఐబీ, డీబీఎఫ్ విభాగాల్లో డిగ్రీ, కో ఆపరేటివ్ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో డిప్లొమా, సీఏ, పీజీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) లో పలు ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ వేతనం కల్పించున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) లో కాంట్రాక్ట్ విదానంలో ఖాళీగా ఉన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 28 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వెకెన్సీల సంఖ్య: 1
*తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు వెకెన్సీ ఉంది.
పోస్టు పేరు – ఖాళీలు:
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : 1 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ(సీఏఐఐబీ, డీబీఎఫ్), డిప్లొమా(కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్), సీఏ, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 62 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000 దరఖాస్తు ఫీజు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.97,620 జీతం కల్పిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, 4-1-441, ట్రూప్ బజార్, హైదరాబాద్-500001 అడ్రస్ కు దరఖాస్తు పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: tgcab.in
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28
Also Read: Telanagna Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు..
Also Read: HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..