Retro Trailer: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రెట్రో (Retro). గ్యాంగ్స్టర్, యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మ్యూజిక్ విజువల్స్ అదిరిపోతున్నాయని చెప్పాలి. ఇందులో సూర్య సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ఇందులో ఆమె డీ గ్లామరస్ పాత్ర పోషిస్తుంది. సూర్యా కూడా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారు. మొత్తానికి అయితే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఈ ట్రైలర్ సాగుతోంది అని చెప్పవచ్చు.
ట్రైలర్ లో ఏముందంటే..?
ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఏముంది అనే విషయానికి వస్తే.. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే.. “వెల్కం.. వెల్కం..వెల్కమ్.. కాసేపు ఆగితే మంచి జింక బిర్యానీ రెడీ.. ఆలోపు ఒక షో చేయ్ అనే డైలాగుతో స్టార్ట్ అవుతుంది అంటూ సూర్య టీమ్ తో ఒక వంట వ్యక్తి అంటాడు. ఇక వెంటనే మూవీ రెట్రో టైటిల్ పడుతుంది. ఇక్కడ సూర్యాను ఒక విభిన్నమైన గెటప్ లో చూపించారు. షో చేద్దామా అంటూ పూజ హెగ్డే ముందు బైకుతో చాలా స్టైలిష్ గా స్టంట్ వేస్తారు సూర్య. ఇక తర్వాత యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ కూడా ఒకేసారి చూపించేశారు. ఇందులో సూర్య రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. సూర్య.. పూజా హెగ్డే ను వివాహం చేసుకున్న తర్వాత కుటుంబాన్ని చాలా ప్రశాంతంగా లీడ్ చేస్తూ ఉంటాడు. అనూహ్యంగా వారి జీవితాల్లో జరిగిన సంఘటన సూర్యను రాక్షసుడిలా మార్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సూర్య ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. ? రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు కదా.. అన్నదమ్ములా లేక మరేదైనా బంధం ఉందా ? అనే అనుమానాలకు తెర లేపుతూ చాలా చక్కగా ట్రైలర్ తో సినిమా పై హైప్ క్రియేట్ చేశారు కార్తీక్ సుబ్బరాజు..”అద్భుతమైన సంఘటనలు.. త్వరలో ఇంకెన్నో చూస్తారు”.. “వాడు అందరి పల్స్ పట్టేశాడు.. ఇంకా ఏమేం ఆటలు ఆడతాడో ” వంటి డైలాగ్స్ కాస్త సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
ఆడియన్స్ అభిప్రాయం..
ఇక మాస్ లుక్స్ లో సూర్య అదరగొట్టేసారని చెప్పాలి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు కూడా..” చాలా కొత్తగా ఉంది. ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.. అర్థం అయి.. కానట్టు ఉంది.. అంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది అని అభిమాని కామెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే సూర్య ఈ పాత్రలలో చాలా సహజంగా నటించారు. ఇక భారీ అంచనాల మధ్య మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Alekhya Chitti Pickles : అక్కను పక్కన పెట్టి… రమ్య పికిల్స్.. వీళ్లు మళ్లీ వచ్చేశారు.. ధర తక్కువంటా…