NCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి మెట్రిక్యూలేషన్, సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాసైన అభ్యర్థులకు సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో పలు వెకెన్సీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ స్టేట్ సింగ్రౌలీ, యూపీ స్టేట్ లోని సోన్ భద్రలోని కేంద్ర ప్రభుత్వ మినీరత్న కంపెనీ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వివిధ విభాగాల్లో 200 టెక్నికల్ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 200
కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో పలు రకాల వెకెన్సీలు ఉన్నాయి. టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ), టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైనీ), టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ) పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ) : 95 పోస్టులు
టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) : 95 పోస్టులు
టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ): 10 పోస్టులు
వివిధ విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి. ఎక్స్కవేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 10
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి మెట్రిక్యూలేషన్, సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాసై ఉండాలి.
వయస్సు: 18 నంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nclcil.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 200
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 10
Also Read: Jobs: ఆ జిల్లా వారికి గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: TGCAB: తెలంగాణ టీజీసీఏబీలో పోస్టులు.. ఈ అర్హత ఉంటే చాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.97,620