E-Paper
Advertisement

ADA Recruitment: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఉద్యోగం భయ్యా.. ఈ జాబ్ మీకు వస్తే జీతం రూ.1,00,000కు పైనే..

ADA Recruitment: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఉద్యోగం భయ్యా.. ఈ జాబ్ మీకు వస్తే జీతం రూ.1,00,000కు పైనే..
Advertisement

ADA Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ లో పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. ఏరోనాటిక్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

ఏరోనాటిక్స్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ADA) బెంగళూరు వివిధ విభాగాల్లో వెకెన్సీ ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోండి. ఏప్రిల్ 21వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133

ఏరోనాటిక్స్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సైంటిస్ట్-బి, సైంటిస్ట్ – సీ పలు విభాగాల్లో  ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విభాగాలు: ఏరోనాటికల్, మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు

సైంటిస్ట్- బి: 103 పోస్టులు

సైంటిస్ట్-  సి: 32 పోస్టులు

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 21

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, గేట్‌లో పాస్ తో  పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఏప్రిల్ 21 నాటికి సైంటిస్ట్‌-సి పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌-బి పోస్టులకు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు సైంటిస్ట్‌-బి పోస్టులకు రూ.90,789, సైంటిస్ట్‌-సి పోస్టులకు రూ.1,08,073 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.ada.gov.in/

అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు పెట్టుకోండి. అవకాశం మళ్లీ రాదు. ఈ ఉద్యోగంలో మీరు కనుక సెలెక్ట్ అయితే మంచి వేతనం ఉంటుంది. నెలకు సైంటిస్ట్‌-బి పోస్టులకు రూ.90,789, సైంటిస్ట్‌-సి పోస్టులకు రూ.1,08,073 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 21

ఇది కూడా చదవండి: NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుకు ఆలస్యం..!

ఇది కూడా చదవండి: ALP Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. 9970 రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ షురూ.. ఇంకెందుకు ఆలస్యం..?

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×