E-Paper
Advertisement

NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుకు ఆలస్యం..!

NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుకు ఆలస్యం..!
Advertisement

NTPC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) లేదా డిగ్రీతో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది బంపర్ ఆఫర్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు.  ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

దేశంలోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

కేటగిరీ వారీగా ఉద్యోగాలు చూసినట్టయితే..

యూఆర్: 8 పోస్టులు

ఈడబ్ల్యూఎస్: 1 పోస్ట్

ఓబీసీ: 3 పోస్టులు

ఎస్సీ: 2 పోస్టులు

ఎస్టీ: 1 పోస్టు

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) లేదా డిగ్రీతో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 45 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.)

ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్ లిస్ట్,  సెలక్షన్ బోర్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.71,000 వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ntpc.co.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.71,000 వేతనం ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు..? వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 25

ఇది కూడా చదవండి: Mega Job Fair: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 8,000 ఉద్యోగాలకు తెలంగాణలో మెగా జాబ్ మేళా..

ఇది కూడా చదవండి: ALP Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. 9970 రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ షురూ.. ఇంకెందుకు ఆలస్యం..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×