Premaku Jai: ప్రేమకథలు అనేవి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు. ముఖ్యంగా యూత్‌లో లవ్ స్టోరీలకు సెపరేట్ డిమాండ్ ఉంటుంది. అందుకే మేకర్స్ సైతం దీనిని సక్సెస్ ఫార్ములాగా భావించి ఇలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో మూవీ యాడ్ కానుంది. అదే ‘ప్రేమకు జై’ (Premaku Jai). క్యాచీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ ప్రేమకథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈవారం ఇప్పటికే పలు సినిమాలు విడుదల కాగా ‘ప్రేమకు జై’ కూడా ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే మూవీ టీమ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు చూడని ప్రేమకథ
మామూలుగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ‘ప్రేమకు జై’కు కూడా పాజిటివ్ బజ్ ఏర్పడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అనిల్ బురగాని, జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించారు. అనసూర్య నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు. ‘ప్రేమకు జై’తో ఇప్పటివరకు తెరపై చూడని ఓ లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది.
మంచి ఔట్‌పుట్
ప్రెస్ మీట్‌లో దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ.. ‘‘పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. హీరోహీరోయిన్లు బాగా నటించారు. టీమ్ అంతా సమానంగా కష్టపడడం వల్ల సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్‌లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. ‘ప్రేమకు జై’ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్‌గా నటించాడు చైతూ సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ బాధ్యతలు సామ్రాట్ తీసుకోగా సినిమాటోగ్రాఫర్‌గా ఉరుకుందా రెడ్డి వ్యవహరించారు.
Also Read: అంత పెద్ద నటి రూ.50 కోసం.. చివరికి ఏమీ లేకుండా చనిపోయారు: వై విజయ
రూబిక్స్ క్యూబ్
ఇక ప్రస్తుతం మరెన్నో సినిమాలు కూడా ప్రారంభోత్సవాలు జరుపుకుంటూ మంచి ఔట్‌పుట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి ప్రారంభమయ్యింది. బిగ్ రాక్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెలంగాణ వాయిస్ స్టూడియోస్ సమర్పిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రారంభమయ్యింది. దీనికి ‘రూబిక్స్ క్యూబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రూబిక్స్ క్యూబ్ అనేది అతి కష్టమైన పజిల్. దీన్ని బట్టి చూస్తే ఇదొక థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమవుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి రమేష్ కిషన్ దర్శకత్వం వహించడంతో పాటు తనే హీరోగా కూడా నటిస్తున్నారు. కథ కూడా ఆయనే రాసుకున్నారు. విజయ్ బొల్లా సంగీతం అందిస్తుండగా.. పోతుగంటి అంజయ్య దీనికి మాటలు రాశారు.