IND Vs OMAN : ఆసియా కప్ 2025లో భాగంగా లీగ్ దశలో ఇవాళ చివరి మ్యాచ్ టీమిండియా వర్సెస్ ఒమన్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఒమన్ జట్టు ఫస్ట్ ఫీల్డింగ్ చేయనుంది. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, యూఏఈ జట్లతో విజయం సాధించి గ్రూపు ఏ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ మాత్రం యూఏఈ, ఒమన్ జట్లతో విజయం సాధించి నెంబర్ 2 స్థానంలో ఉంది. అయితే గ్రూపు దశకు అర్హత సాధించిన టీమిండియా ఈనెల 21న పాకిస్తాన్ తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగే మ్యాచ్ లో టీమిండియా పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. వీరి స్థానంలో బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తీస్తే.. అర్ష్ దీప్ సింగ్ 100 వికెట్లు తీసి రికార్డును నెలకొల్పనున్నాడు.
Also Read : Asia Cup 2025 : మహమ్మద్ నబీ 5 సిక్సర్ల దెబ్బకు శ్రీలంక బౌలర్ తండ్రి చనిపోయాడా?
తొలి రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా స్పిన్నర్లు అదురగొట్టారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ యూఏఈ పై 4 వికెట్లు, పాకిస్తన్ పై 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ యూఏఈ పై 1 వికెట్, పాకిస్తాన్ పై 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు టోర్నీలో బౌలర్లు పెద్దగా కష్టపడింది లేదు. యూఏఈ పై కేవలం టాప్ ఆర్డర్ లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ పై టాప్ 5 బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు. టోర్నీలో ఇప్పటివరకు సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒమన్ తో జరిగే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి బ్యాటర్లకు ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. మరోవైపు ఒమన్ జట్టు ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్, రెండో మ్యాచ్ యూఏఈతో ఓటమి చెందిన ఒమన్.. మూడో మ్యాచ్ టీమిండియాతో తలపడనుంది. ఒమన్ జట్టు పాకిస్తాన్ కి గట్టిగానే పోటీ ఇచ్చింది. కానీ యూఏఈ కి మాత్రం పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒమన్ బౌలింగ్ అద్బుతంగా చేసింది. కానీ బ్యాటింగ్ లో విఫలం చెందింది.
టీమిండియా జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా.
అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(c), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా(w), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది.