BigTV English

YSRCP : గోరంట్ల మాధవ్ అరెస్ట్? చేబ్రోలు కిరణ్‌పై అటాక్!

YSRCP : గోరంట్ల మాధవ్ అరెస్ట్? చేబ్రోలు కిరణ్‌పై అటాక్!

YSRCP : మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతిపై అనుచిత కామెంట్లు చేసిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించారు. కిరణ్‌ను పోలీసులు వెహికిల్‌లో తరలిస్తుండగా.. ఆ వాహనాన్ని గోరంట్ల మాధవ్, అతని అనుచరులు వెంబడించారు. మంగళగిరి నుంచి గుంటూరు వరకు ఫాలో అయ్యారు. దారి మధ్యలో పోలీస్ వెహికిల్‌ను అడ్డుకునేందుకు ట్రై చేశారు. ఆ తర్వాత, ఎస్పీ ఆఫీసులోనూ కిరణ్‌ను కొట్టేందుకు మరోసారి మాధవ్, అతని నలుగురు అనుచరులు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి.. మాధవ్ అండ్ బ్యాచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.


కిరణ్ ఎపిసోడ్‌లో గోరంట్ల ఎంట్రీ..

ఐడీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ ఉదయం నుంచి ఏపీలో కాక రేపుతోంది. వైఎస్ జగన్ సతీమణి భారతి గురించి అతను అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్ కావడంతో వైసీపీ విమర్శలకు దిగింది. టీడీపీ వాళ్లు ఇలా బూతులు తిడితే కేసులు పెట్టరా అంటూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు. విషయం టీడీపీ హైకమాండ్ దృష్టికి చేరింది. కిరణ్ వ్యాఖ్యలపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు, చేబ్రోలు కిరణ్‌పై పోలీస్ కేసు సైతం నమోదైంది. ఇబ్రహీంపట్నం దగ్గర అతన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు పోలీసులు. ఇదే సమయంలో వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్ ఎంట్రీ ఇచ్చి మరింత రచ్చ చేశారు.


పోలీస్ కార్‌ను వెంటాడి..

కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీసుకొస్తున్న విషయం తెలిసి.. తన అనుచరులతో కారులో వెంబడించారు గోరంట్ల మాధవ్. పోలీస్ వెహికిల్‌ను అడ్డుకుని కిరణ్‌పై దాడి చేయాలనేది ఆయన ప్లాన్. కానీ, అది సాధ్యపడలేదు. అయినా మాధవ్ వదలలేదు. పోలీస్ కారుకు సమాంతరంగా తన కారును పోనిచ్చి.. రన్నింగ్‌లోనే దాడి చేయాలని ట్రై చేశారు. అది కూడా వర్కవుట్ కాలేదు. అలా మంగళగిరి నుంచి గుంటూరు వరకూ.. గోరంట్ల ఛేజింగ్ నడిచిందని చెబుతున్నారు.

ఎస్పీ ఆఫీసులోనే దాడి?

కిరణ్‌ను తీసుకొచ్చిన వాహనం ఎస్పీ ఆఫీసుకు చేరుకోగానే.. మరోసారి దాడికి యత్నించారు మాధవ్ అండ్ అతని నలుగురు అనుచరులు. ఆ సమయంలో కిరణ్‌ను కొట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు అలర్ట్ గా ఉండి.. మాధవ్ నుంచి కిరణ్‌ను సురక్షితంగా తప్పించారని అంటున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందున మాధవ్‌ను అతని అనుచరులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మాధవ్ మీద కూడా కేసు నమోదు చేస్తారని అంటున్నారు.

Also Read : క్లీన్ పాలిటిక్స్.. ఇదికదా చంద్రబాబు అంటే..

మాధవ్ ఓవరాక్షన్ అందుకేనా?

అధినేత మెప్పు కోసమే గోరంట్ల మాధవ్ ఇంతలా యాక్షన్ చేశారని అంటున్నారు. జగన్ భార్యను తిట్టాడు కాబట్టి.. కిరణ్‌ను కొడితే తనకు మంచి మైలేజ్ వస్తుందని అనుకున్నారా? మాజీ పోలీస్ అధికారి అయిన మాధవ్‌కు ఇలాంటి పనులు చేయడం తప్పని తెలీదా? తెలిసే చేశారంటే.. జగన్ దగ్గర క్రెడిట్ కోసం కాకపోతే మరెందుకు? అంటున్నారు. ఇటీవల పోలీసులపై జగన్ చేసిన కామెంట్లపై రచ్చ నడుస్తోంది. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకే కిరణ్‌ ఇష్యూను హైలైట్ చేస్తున్నారని కూడా టీడీపీ భావిస్తోంది. అయితే, తమ పార్టీ కార్యకర్త చేసింది తప్పు అని తెలిసి అతనిపై వేటు వేయడం టీడీపీకే అనుకూలంగా మారింది. కిరణ్‌పై కేసులు పెట్టడం.. అతన్ని పోలీసులు ఈడ్చుకురావడం.. అరెస్ట్ చేయడం.. టోటల్ ఎపిసోడ్‌లో టీడీపీ అవలంభించిన విధానం అందరి మెప్పు పొందుతోంది. అది మింగుడు పడకనే.. గోరంట్ల మాధవ్ అలా అటాక్ చేశారని కూడా అంటున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×