BigTV English
Advertisement

Mega Job Fair: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 8,000 ఉద్యోగాలకు తెలంగాణలో మెగా జాబ్ మేళా..

Mega Job Fair: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 8,000 ఉద్యోగాలకు తెలంగాణలో మెగా జాబ్ మేళా..

Mega Job Fair: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ చొరవతో రేపు (ఏప్రిల్ 11) మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. వరంగల్ లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


దాదాపు 100 కు పైగా కంపెనీలు, 8వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. జాబ్ మేళా నిర్వాహకులు, ఉన్నత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.

నిరుద్యోగ యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేసవి కాలం, అలాగే అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకుని జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతీ, యువకులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులకు, మెగా జాబ్ మేళా నిర్వాహకులకు సూచించారు. జాబ్ మేళా వద్ద అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్, పోలీసులు, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే మెగా జాబ్ మేళాకు 60 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మరో 40 నుంచి 50 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోనున్నాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


8 వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొండా సుష్మిత పటేల్ ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహిస్తామని ఇచ్చిన మాట ప్రకారమే.. ఈ మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, బీటెక్ పాసైన వారందరూ ఈ జాబ్ మేళాకు అటెండ్ అవ్వొచ్చు. జెన్ ప్యాక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, జెప్టో, జీఎంఆర్, టెక్ మహీంద్ర, ఇంకా తదితర ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. జాబ్ మేళాకు వచ్చే విద్యార్థులకు భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోవాలన్నారు.

మెగా జాబ్ మేళా తేది: ఏప్రిల్ 11

ప్లేస్: వరంగల్, ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్..

ఇది కూడా చదవండి: ALP Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. 9970 రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ షురూ.. ఇంకెందుకు ఆలస్యం..?

ఇది కూడా చదవండి: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

 

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×