Pawan Kalyan : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun ) తన ఆర్మీ గురించి గొప్పగా చెప్పుకుంటాడు. వాళ్లు చేస్తున్న కొన్ని పనులు జనాలకు విపరీతమైన కోపాన్ని కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీలోని హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం కొత్తేమి కాదు. అందరు హీరోల అభిమానులదీ ఇదే బాట. ఆ ఫ్యాన్ వార్స్ అనేవి ఓ స్థాయి వరకూ తప్పు కాకపోవచ్చు.. కానీ కొన్ని సార్లు అవే కొందరికి కోపాన్ని, మరికొందరికి బాధను కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటిదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్, సింగపూర్‌లో చదువుకుంటున్నాడు.. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పై ఓ అల్లు అర్జున్ అభిమాని సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా ట్వీట్ చేశాడు. దాంతో పాటుగా బూతులు రాశాడు. ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న పిల్లాడిపై అలాంటి ట్వీటా? వీడు మనిషేనా?.. ఇలాంటి సోషల్ టెర్రరిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా.? లేదా.? అంటూ, జనసేన పార్టీని ప్రశ్నిస్తూ.. పనిలో పనిగా, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది..
ఫిర్యాదుపై స్పందించిన అజయ్ కుమార్..
అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు పవన్ కళ్యాణ్ కుమారుడిని నీచంగా తిడుతూ RIP అంటూ చేసిన ట్వీట్ పై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై జనసేన పార్టీ నేత, అజయ్ కుమార్ ఈ వ్యవహారంపై స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఈ విషయమై మాట్లాడాననీ, తగిన చర్యలు తీసుకుంటామని , త్వరలోనే హోం మంత్రి చర్యలు తీసుకుంటారని ట్విట్టర్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు. ఆవేశ పడవద్దని చట్టం అన్నీ చూస్తుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సినీ ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
Hello @JanaSenaParty మీరు చర్యలు తీసుకుంటారా?
చట్టాలు మా చేతుల్లోకి తీసుకోమంటారా?? @Anitha_TDP @dgpapofficial @APPOLICE100 పసి పిల్లల మీద డెత్ trolls వేస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుకు మీదనే ఇలా చేస్తున్నప్పుడు…సామాన్యుడి పరిస్థితి ఏంటి???Sir pls act on this… pic.twitter.com/siN4bDukHY
— PJ Raghu Ranjith 🚩 (@PJRaghuRanjith) April 9, 2025
Also Read :సడెన్ గా ఓటీటీలోకి ‘ఛావా’ ఎంట్రీ.. ఎక్కడ చూడొచ్చంటే..?
అల్లు VS మెగా..
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.. గతంలో జరిగిన ఎన్నికల వల్ల మొదలైన గొడవలు ఇరు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచేసింది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరు మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేదీ అల్లు అర్జున్‌కి తెలియదని అనుకోలేం.. అయితే తెలిసీ కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు.? ఆ మౌనం వెనక అర్థమేంటి? అల్లు అర్జున్ కావాలనే ఫ్యాన్స్ తతంగాన్ని చూసి మురిసిపోతున్నాడా? ఫ్యాన్స్ ను హెచ్చరించలేడా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. నెట్టింట ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్ ఎక్కడ స్పందించినట్లు కనిపించలేదు. అసలు ఎందుకు అల్లు అర్జున్ ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు అల్లు అర్జున్ అభిమానులు సైతం ఆయన తీరు పై మండిపడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..