IAF Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హతలు, వయస్సు, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు తేదీల గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఇండియన్ ఎయిర్‌ఫోర్సు నుంచి 153 గ్రూప్ సీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జూన్ 8న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 153
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లాండ్రీమ్యాన్, తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు వెకెన్సీలు చూసినట్లయితే..
లోయిర్ డివిజన్ క్లర్క్ : 14 పోస్టులు
హిందీ టైపిస్ట్ : 2 పోస్టులు
స్టోరీ కీపర్ : 16 పోస్టులు
కుక్ (ఓజీ) : 12
కార్పెంటర్ : 3 పోస్టులు
పెయింటర్ : 3 పోస్టులు
మెస్ స్టాఫ్: 7 పోస్టులు
హౌజ్ కీపింగ్ స్టాఫ్: 31 పోస్టులు
లాండ్రీ మ్యాన్: 3 పోస్టులు
వొల్కనైజర్ : 1 పోస్టు
సివిలియన్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్: 8 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాసై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 8
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://indianairforce.nic.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది.
ALSO READ: ECIL Notification: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, జాబ్ మీదే
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 153
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 8