BDL Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 156 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. డిసెంబర్ 8న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 156
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పోస్టులు – వెకెన్సీలు:
ఫిట్టర్: 70 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 10 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 30 పోస్టులు
మెకానిస్ట్: 15 పోస్టులు
మెకానిస్ట్ గ్రిండర్: 2 పోస్టులు
మెకానిక్ డిజిల్: 5 పోస్టులు
మెకానిక్ ఆర్ అండ్ ఏసీ: 5 పోస్టులు
టర్నర్: 15 పోస్టులు
వెల్డర్: 4 పోస్టులు
విద్యార్హత: ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 14 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 8
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bdl-india.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 156
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 8
ALSO READ: Spiritual Power of Salt: ఇంట్లో గొడవలు తగ్గాలంటే.. ? ఉప్పుతో ఇలా చేయండి చాలు