Agniveer Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పాసైన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఉద్యోగ వెకెన్సీలు, విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అగ్నివీర్ వాయు ఖాళీల భర్తీ చేసేందుకు ఐఏఎఫ్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
నోట్: ఇంకా వారం రోజుల సమయమే ఉంది..
బ్యాచ్: అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (02/2026) బ్యాచ్ నియామకం
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా.. ఇంటర్ ఒకేషనల్.. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 11
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 31
ఆన్ లైన్ ఎగ్జామ్స్: సెప్టెంబర్ 25
నిర్దిష్ట శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు: 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైట్: పురుషులు/ మహిళలు 152 సెంటిమీటర్లు ఉండాలి. ఈశాన్య లేదా ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు 147 సెంటీమీటర్లు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.550 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
బ్యాచ్: అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (02/2026) బ్యాచ్ నియామకం
దరఖాస్తుకు చివరి తేది: జులై 31
ALSO READ: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో