BigTV English

AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో

AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ  కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో

AIIMS Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంస్), న్యూఢిల్లీలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవండి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఎంసీఏ, బీటెక్‌/ ఎంటెక్‌/ బీఈ, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, బీఫార్మసీ పాసై ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.


ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్), న్యూఢిల్లీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్-బీ, గ్రూప్- సీ నాన్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జులై 31న దరఖాస్తు గడువు ముగియనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3501


ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, లాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, కాషియర్, ఓటి అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్‌, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్‌, అటెండెంట్‌ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: టెన్త్‌, ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఎంసీఏ, బీటెక్‌/ ఎంటెక్‌/ బీఈ, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, బీఫార్మసీ పాసై ఉంటే సరిపోతుంది. కొన్ని పోస్టులకు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 12

దరఖాస్తుకు చివరి తేది: జులై 31

సీబీటీ ఎగ్జామ్ డేట్స్: ఆగస్ట్ 25, 26

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్స్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://rrp.aiimsexams.ac.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3501

దరఖాస్తుకు చివరి తేది: జులై 31

ALSO READ: DSSSB: ఈ అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.1,50,000 జీతం బ్రో.. డోంట్ మిస్

Related News

DDA Notification: డీడీఏలో 1732 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెంబర్ వన్ జాబ్ భయ్యా.. చివరి తేది ఇదే

DSSSB Jobs: ఇంటర్ అర్హతతో 1180 జాబ్స్.. ఈ జాబ్ వస్తే భారీ సంపాదన.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

UPSC Jobs: యూపీఎస్సీలో 213 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే

TGPSC Group-1: గ్రూప్-1 వివాదం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TGPSC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

IBPS RRB: డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, ఇంకా 4 రోజులే

Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్

IOCL Jobs: పదో తరగతి అర్హతతో భారీగా జాబ్స్.. మంచి వేతనం.. 2 రోజులే గడువు

Big Stories

×