Indian Coast Guard Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డులో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వరకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
NOTE: ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది.
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్టు గార్డులో టాలెంట్ కలిగిన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి జనరల్ డ్యూటీ, టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య:
ఈ నోటిఫికేషన్‌లో 170 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..
ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ- జీడీ) : 140 పోస్టులు
అసిస్టెంట్ కమాండెంట్ (టెక్నికల్ – ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్) : 30 పోస్టులు
విద్యార్హత:
ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతను నిర్ణయించారు. జనరల్ డ్యూటీ కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది. టెక్నికల్ బ్రాంచ్ కోసం సంబంధిత ఇంజినీరింగ్ శాఖల్లో డిగ్రీ ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 అక్టోబర్ 31 లోగా డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది:
జులై 27న దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది.
వయస్సు:
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 నుంచి రూ.1,23,000 వరకు వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం:
మొత్తం ఐదు దశల్లో ప్రాసెస్ ఉంటుంది. కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, అర్హత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, సైకాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎస్‌బీ కేంద్రాలు:
నోయిడా, గోవా, చెన్నై, కోలకత్తా, గువహటి, గాంధీనగర్
దరఖాస్తు ఫీజు:
రూ.300 ఫీజు చెల్లించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ తప్పనిసరి..
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్:
https://joinindiancoastguard.cdac.in/ (ఏమైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్‌ను సందర్శించండి.)
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.56,100 నుంచి రూ.1,23,000 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 170
దరఖాస్తుకు చివరి తేది: జులై 27
ALSO READ: BSF Recruitment: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..
ALSO READ: DSSSB: ఈ అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.1,50,000 జీతం బ్రో.. డోంట్ మిస్