BigTV English

Special Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే 6 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Special Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే 6 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Indian Railways: ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ, తమిళనాడు, కేరళ మధ్య నడుస్తున్న ఆరు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ–మధురై-కాచిగూడ స్పెషల్, హైదరాబాద్–కొల్లం-హైదరాబాద్ స్పెషల్,  హైదరాబాద్–కన్యాకుమారి-హైదరాబాద్ స్పెషల్ సర్వీసులను మరికొంత కాలం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ  ఆరు రైళ్లు ఆగస్టు నుంచి అక్టోబర్  వరకు తొమ్మిది అదనపు ట్రిప్పులు అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


పొడిగించిన ప్రత్యేక రైలు సర్వీసులు ఇవే!

⦿ ప్రస్తుతం సోమవారాల్లో నడిచే నడిచే (రైలు నెం. 07191) కాచిగూడ–మధురై స్పెషల్, ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు నడుస్తుంది. బుధవారం నాడు తిరుగు ప్రయాణం అయ్యే (రైలు నెం. 07192) మధురై–కాచిగూడ స్పెషల్, ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు నడుస్తుంది.


⦿ హైదరాబాద్–కొల్లం స్పెషల్(రైలు నెం. 07193) ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 07194) కొల్లం–హైదరాబాద్ స్పెషల్, ఆగస్టు 18, అక్టోబర్ 13 మధ్య సోమవారాల్లో నడుస్తుంది.

⦿అటు హైదరాబాద్–కన్యకుమారి స్పెషల్ (రైలు నెం. 07230) ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8 వరకు బుధవారాల్లో నడుస్తుంది. కన్యకుమారి–హైదరాబాద్ స్పెషల్(రైలు నెం. 07229) ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 10 వరకు శుక్రవారాల్లో నడుస్తుంది.

ఇక ఈ ప్రత్యేక రైలు సర్వీసులకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు జూలై 24 నుంచి ప్రారంభంకానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తమిళనాడు, కేరళ, హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.

స్లీపర్ కోచ్ లు పెంచిన సౌత్ సెంట్రల్ రైల్వే

మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్లకు సంబంధించి స్లీపర్ కోచ్ లను పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా ఆయా రైళ్లకు సంబంధించిన స్లీపర్ కోచ్ లు తగ్గించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు.ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు కొనసాగించే ముంబై ఎక్స్ ప్రెస్ లో(22731/22732 సెప్టెంబరు 23, 26 తేదీల నుంచి 2 స్లీపర్ కోచ్ లు పెంచుతున్నారు  అటు ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై- హైదరాబాద్, హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై మధ్య నడిచే హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ (12701/12702)లో సెప్టెంబరు 24, 25 తేదీల నుంచి 2  స్లీపర్‌ బోగీలు పెరగనున్నాయి.  సికింద్రాబాద్‌- భువనేశ్వర్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే  విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ (17016/17015)లో సెప్టెంబరు 23, 25 తేదీల నుంచి 3 చొప్పున స్లీపర్‌ బోగీలను పెంచబోతున్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే ఆ రైళ్లలో స్లీపర్ కోచ్‌ల పెంపు.. ఇక ఆ కష్టాలు తీరినట్లే!

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×