NLC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ గుడ్ న్యూస్. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా మైనింగ్ లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) 171 ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తుక చేసుకోండి. జూన్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 171
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్దార్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ ఓవర్ మ్యాన్ : 69 ఉద్యోగాలు
మైనింగ్ సర్దార్ : 102 ఉద్యోగాలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 4
విద్యార్హతలు: మైనింగ్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ పాస్ తో పాటు వ్యాలిడ్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 30 ఏళ్లు దాటరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ ఓవర్‌మ్యాన్ రూ.31,000- రూ.1,00,000 జీతం ఉంటుంది. మైనింగ్ సర్దార్‌కు రూ.26,000- రూ.1,10,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: జూనియర్ ఓవర్‌మ్యాన్‌కు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.595 ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి రూ.295 ఫీజు ఉంటుంది. మైనింగ్ సర్దార్‌కు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.486 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ వారికి రూ.236 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nlcindia.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ ఓవర్ మ్యాన్ రూ.31,000- రూ.1,00,000 జీతం ఉంటుంది. మైనింగ్ సర్దార్‌కు రూ.26,000- రూ.1,10,000 జీతం ఉంటుంది.
Also Read: DRDO Recruitment: అద్భుత అవకాశం.. డీఆర్‌డీవో నుంచి భారీ నోటిఫికేషన్.. స్టార్టింగ్ జీతమే?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 171
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 4
ALSO READ: ECIL Recruitment: సూపర్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.40,000