Birth Nakshatras: పుట్టుకతోనే కుబేర యోగాన్నిఇచ్చే నక్షత్రాలు ఏవో తెలుసా..? ఆ నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు ఎప్పటికైనా కోట్లకు పడగలెత్తురాని మీకు తెలుసా..? అఖండమైన ధన సంపద వారి సొంతమవుతుందని మీకు తెలుసా..? ఇంతకీ ఆ నక్షత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే కొందరు ఉంటారు. వారే కోటీశ్వరులు ఆలాంటి కోటీశ్వరులు పుట్టేది కొన్ని నక్షత్రాల్లోనే అని జ్యోతిస్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. వీరు జీవితంలో కోటీశ్వరుడిగా పుట్టకపోయినా తర్వాత కలిసి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట. ఆలాంటి కుబేర యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం:
ఆశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. వీరికి తెలివి, ధైర్యం ఏదైనా పని చేసే సామర్థ్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వారికి సొంతంగా డబ్బులు సంపాదించే యోగం ఉంటుంది.
భరణి నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు జీవితాంతం ధనవంతులుగా జీవిస్తారు. వీరు జీవితంలో ఎక్కువగా స్థలాలు, భూములు కొనుగోలు చేస్తారు. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. వీరు జీవితంలో ఎలాంటి కష్టానైనా తట్టుకుని పని చేయగలరు. వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, కాబట్టి ఈ నక్షత్ర జాతకులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అందాన్ని ఆరాధిస్తారు. ఆనందాన్ని కోరుకుంటారు. వీరు కళాపోషణలో ముందుంటారు.
కార్తీక నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు విద్యా వంతులై ఉంటారు. జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా జీవిస్తారు. నిజాయితీగా బతకడం వీరికి ఎంతో ఇష్టం. అలాగే వీరు ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంటారు.
మఖ నక్షత్రం:
మఖ నక్షత్ర జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు రాజకీయాలలో బాగా రాణిస్తారు. నైతికతతో కూడిన జీవితం గడపడానికి ఇష్టపడతారు. జీవితాంతం సంపద, అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు మఖ నక్షత్ర జాతకులు. ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టంఅనుకూలిస్తుంది.
పూర్వ పాల్గుణి నక్షత్రం:
పూర్వ పాల్గుణి నక్షత్ర జాతకులు అందంలోనూ.. పరాక్రమంలోనూ ఇతరులకు భిన్నంగా ఉంటారు. చక్కగా మాట్లాడటంలోనూ.. ఇతరులను ఆజ్ఞాపించడంలోనూ దిట్టగా ఉంటారు. ఇతరులతో స్నేహంగా మెలగడంలోనూ వీరికి వీరే సాటి. కానీ ఇతరులకు లోబడి పని చేయడానికి వీరు ఇష్టపడరు. వీరు స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. అయితే ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు. కళ్లల పట్ల ఆసక్తి, విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు.
ఉత్తర పాల్గుణి నక్షత్రం:
ఈ నక్షత్ర జాతకులు తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధిస్తారు. ఈ ఉత్తర పాల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు ఉత్రం లేదా ఉత్తరి అనే పేర్లతో పిలవడబతారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆధిరోహిస్తారు. ఈ నక్షత్ర జాతకులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు. వీరు జీవితంలో కోట్ల రూపాయల ధనం సంపాదించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలుస్తారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్