BigTV English
Advertisement

OTT Movie : చెల్లితో చేయకూడని పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చెల్లితో చేయకూడని పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఎన్నో భాషలలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటన్నిటికీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఒక వేదికగా ఉంది. వీటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తే, మరికొన్ని బోల్తా కొడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మలయాళం సినిమా భారీ అంచనాలతోనే రిలీజ్ అయింది. అయితే అనుకున్నంత టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. స్టోరీ పరంగా పర్వాలేదనిపించినా, కొన్ని మైనస్ పాయింట్లు ఈ సినిమాకు కలిసి రాలేదు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

శాంతారామ్ (ధ్యాన్ శ్రీనివాసన్)అనే యువ జైలర్, ఐదుగురు నేరస్థులలో మార్పు తీసుకురావాడానికి ఒక ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపడతాడు. వీరిని గాంధీ గ్రామంలోని ఒక బంగళాలో ఉంచి, వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనుల ద్వారా వారిని సమాజంలో తిరిగి మంచి మనుషులుగా మార్చాలని భావిస్తాడు. ఈ క్రమంలో శాంతారామ్ నేరస్థులకు సానుభూతి చూపిస్తూ, వారిలో ఉన్న మంచి లక్షణాలను బయటకు తీసుకొస్తాడు. అయితే నేరస్థుల గత ప్రవర్తన, గ్రామంలోని ఒక ఫ్యూడల్ లార్డ్‌తో గొడవలు, ఇతర అడ్డంకులు అతని ప్రయత్నాలను సవాల్ చేస్తాయి. అయినా కూడా శాంతారామ్ తాను అనుకున్న దానిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంటాడు. అక్కడ ఉండే బంగ్లాలో ఒక అమ్మాయి కూడా పని చేసుకుని బతుకుతూ ఉంటుంది. వీళ్ళని ఆన్నా అని పిలుస్తూ వాళ్ళకి వంట కూడా చేస్తుంది.


ఒకరోజు ఈ ఖైదీలు మద్యం సేవించి ఆమెపై అఘాయిత్యం చేయాలని అనుకుంటారు. ఆమె అతికష్టం మీద వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది. ఈ సంఘటన జరిగిన తరువాత జైలర్ ఆలోచనలో పడతాడు. చివరికి ఈ నేరస్థుల్లో జైలర్ మార్పును తీసుకొస్తాడా ? జైలర్ ఎదుర్కునే ఆటంకాలు ఏంటి ? అమ్మాయి విషయంలో జైలర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హిస్టారికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా టైటిల్ తోనే రజనీకాంత్ మూవీ కూడా వచ్చింది. అయితే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

Read Also : అడ్వెంచర్ ని మించి పోయే ఆఖరి కోరిక … హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని సినిమా

యూట్యూబ్ (Youtube) లో

ఈ హిస్టారికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జైలర్’ (Jailer). 2023 వచ్చిన ఈ మలయాళ మూవీకి సక్కీర్ మడతిల్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించగా, మనోజ్ కె. జయన్, దివ్యా పిళ్ళై, శ్రీజిత్ రవి సహాయక పాత్రల్లో నటించారు.  వివిధ నేరాలకు పాల్పడిన ఐదుగురు ఖైదీలలో మార్పు తెచ్చే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. యూట్యూబ్ (Youtube) లో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

Big Stories

×