NMDC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మే 8 నుంచి 18 వరకు ఇంటర్వ్యూలను కండక్ట్ చేయనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) లో 179 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నిర్వహించబడే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 179
దరఖాస్తు ఫీజు: ఇంకా తెలపలేదు. త్వరలో అఫీషియల్ ప్రకటన రానుంది.
ఇంటర్వ్యూల తేదీలు: 2025 మే 8 నుంచి 2025 మే 18 వరకు
వయస్సు: త్వరలో ప్రకటించనున్నారు.
విద్యార్హత: బీఈ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా పాసైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వొచ్చు.
వెకెన్సీ వివరాలు చూసినట్టయితే..
సీవోపీఏ : 30 పోస్టులు
మెకానిక్ (డీజిల్) : 25 పోస్టులు
ఫిట్టర్: 20 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 30 పోస్టులు
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్): 20 పోస్టులు
మెకానిక్ (మోటారు వెహికిల్) : 20 పోస్టులు
మెకానిస్ట్ : 5 పోస్టులు
మెకానిక్ ఇంజినీరింగ్: 6 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 4 పోస్టులు
మైనింగ్ ఇంజినీరింగ్: 4 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్ : 2 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ : 5 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ : 3 పోస్టులు
మైనింగ్ ఇంజినీరింగ్ : 1 పోస్టు
ఎంఓఎం : 4 పోస్టులు
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nmdc.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు భర్తీ కోసం నిర్వహించనున్న ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకే నిర్వహించనున్నారు.
Also Read: BREAKING: 2,260 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read: BEL Recruitment: బీటెక్ పాసయ్యారా..? వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. నెలకు రూ.55,000 జీతం