E-Paper
Advertisement

HVF Recruitment: అద్భుత అవకాశం.. టెన్త్, ఐటీఐతో 1850 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్..

HVF Recruitment: అద్భుత అవకాశం.. టెన్త్, ఐటీఐతో 1850 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్..

HVF Recruitment: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. అర్హత ఉన్నవారు ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు వెకెన్సీలు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF)- 2025 సంవత్సరానికి గాను 1850 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 18న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1850

హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF) లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కార్పెంటర్, ఫౌండ్రీ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ జనరల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్లాక్స్ మిత్/ ఫౌండ్రీ/ ఫౌండ్రీమాన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్/ పవర్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, క్రేన్ ఆపరేటర్ విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. లేదా టెన్త్ క్లాస్ పాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే రూ.21,000 ఉంది. (ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి) మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.300 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 28

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 18

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

వెబ్‌సైట్‌: https://oftr.formflix.org

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే రూ.21,000 ఉంది. (ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి) మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ALSO READ: SBI: నిరుద్యోగులు గుడ్‌న్యూస్.. ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1850

దరఖాస్తుకు చివరి తేది: జులై 18

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×