BigTV English

Kuberaa Film : ఇన్ని లాజిక్స్ ఎలా మిస్సయ్యావ్ శేఖర్ కమ్ములా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?

Kuberaa Film : ఇన్ని లాజిక్స్ ఎలా మిస్సయ్యావ్ శేఖర్ కమ్ములా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?

Kuberaa Film: శేఖర్ కమ్ముల గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఇదే జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిసారి కుబేర అనే సినిమా ద్వారా సరికొత్త జానర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాకు ఎంతో మంచి పాజిటివ్ రివ్యూలు రావడం మంచి కలెక్షన్లు రాబట్టడం జరిగింది. ప్రతి చిన్న విషయాన్ని తెరపై ఎంతో క్షుణ్ణంగా చూపించే శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో మాత్రం కొన్ని లాజిక్ లేని సన్నివేశాలను ప్రేక్షకులకు తెరపై చూపించారనే చెప్పాలి. దీంతో పలువురు ఈ సినిమాని క్లుప్తంగా పరీక్షించిన వారు అసలు ఈ సినిమాలో ఇన్ని లాజిక్స్ ఎలా మిస్ అయ్యారు శేఖర్ కమ్ముల అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో మిస్సయిన ఆ లాజిక్స్ ఏంటీ అనే విషయానికి వస్తే..


1. బంగాళాఖాతంలో ఆయిల్ పడినప్పుడు ఆ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం కోసం నీరజ్ అనే వ్యాపారి ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున లంచం ఇస్తూ ఆయిల్ సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఒక ప్రభుత్వ అధికారిని తన వైపుకు తిప్పుకోవాలి అంటే ఎంతమందిని మేనేజ్ చేయాలో ఆయనకు తెలియంది కాదు. తనకు ఇదివరకు ఎప్పుడు డీల్ రాలేదని, కొత్తగా ఈ డీల్ వచ్చిందనే విధంగా జైల్లో ఉన్న సీబీఐ అధికారిని విడిపించి మరి అతనికి ఈ పని అప్ప చెబుతారు. విలువలకు విశ్వసనీయతకు మారుపేరైన నాగార్జున తనకి ఎలా సహాయం చేస్తారనే విషయాన్ని డైరెక్టర్ ఎలా మిస్ అయ్యారు.

2. ఇక నాగార్జున సీబీఐ ఆఫీసర్ నటించారు అంటే ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఎంతో తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉండాలి. నీరజ్ గురించి తెలిసి కూడా నాగార్జున దాడి చేసి ఫైన్ కట్టించారు చివరికి ఆయన తన కుటుంబాన్ని కోసం లొంగి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ మిషన్ లో భాగంగా నాగార్జున ఏకంగా నలుగురు బిచ్చగాళ్ళ కోసం వెతకడం. ఒకరిని వెతికిన సరిపోయేది.


3. బిచ్చగాళ్ళకు గడ్డం చేయించి, కటింగ్ చేయించి వారికి సూటు బూటు వేసి ఏకంగా సీఈఓని చేసి రోబో అనే వాడి చేతిలో హత్య చేయించడం కాస్త ఓవర్గా అనిపించింది. డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కూడా వారి బినామీలుగా డ్రైవర్ లేదా తోటమాలిని పెడతారు కానీ బిచ్చగాళ్ళని పెట్టరు. ఈ చిన్న లాజిక్ శేఖర్ కమ్ముల మిస్ అయ్యారు.

4. ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడుగా నటించిన మంచి చదువు ఉంది. జ్ఞానం తెలివితేటలు ఉన్నాయి. వచ్చే జన్మలో బిచ్చగాడిలాగా పుట్టాలి అనుకోనని చెప్పిన ఈ వ్యక్తి ఈ జన్మలో ఎందుకు బిచ్చగాడిలా ఉన్నాడు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా ?అనే లాజిక్ కూడా తప్పిపోయింది. ఎంతో మంచి తెలివితేటలు ఉండే ధనుష్ ఎవరో డబ్బులు ఇస్తానంటే అమాయకంగా నమ్మి ఎలా వెళ్తారు? సంతకాలు పెట్టమంటే క్షణం ఆలోచించకుండా ఎలా పెడతారు?

5. బ్యాంకు వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేని ఒక బిచ్చగాడు విలన్ ఇంటి ముందు ఒక ట్రక్ నోట్లో కట్లు ఎలా పెట్టగలిగాడు? ఇక్కడ కూడా శేఖర్ కమ్ముల లాజిక్ పూర్తిగా మిస్ అయ్యారు.

6. వ్యాపార రంగాన్ని శాసించిన ఒక వ్యాపారవేత్త బిచ్చగాడిని హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి?

7. సీబీఐ ఆఫీసర్ గా ముక్కు మొహం తెలియని నాగార్జున కుష్బూని కాపాడాడు కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన షియాజీ షిండేను కాపాడకపోవడం విడ్డూరం.

8. రష్మిక నటన విషయానికి వస్తే ఈమె నటన అద్భుతంగా ఉంది కానీ ఒక బిచ్చగాన్ని నమ్మి రిస్కులు చేయటమే విడ్డూరంగా ఉంది.

9. డబ్బు ఉన్న వాళ్లే ఎప్పటికైనా గెలుస్తారు, వాళ్లు చేసేదే న్యాయం, పెద్దవాళ్ళు ఎప్పుడు పేదవాళ్లతో ఆడుకుంటారు సినిమా టికెట్ల రేట్లతో మీరు చేస్తుంది కూడా అదే అంటూ కొంతమంది నెటిజన్లు ఈ సినిమాలో శేఖర్ కమ్ముల మిస్ అయిన లాజిక్కుల గురించి ప్రశ్నలు వేస్తున్నారు.

10. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 150 కోట్లతో డైరెక్టర్ జూదం ఆడారు కానీ సరైన ముక్క మాత్రం పడలేదనే చెప్పాలి.

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×