SBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, వెకెన్సీలు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2025 ఇయర్ కు గానూ 541 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 14న దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 541
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
కేటగిరీ వారీగా పోస్టులు:
యూఆర్: 203 ఉద్యోగాలు
ఓబీసీ: 135 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 50 ఉద్యోగాలు
ఎస్సీ: 80 పోస్టులు
ఎస్టీ: 73 పోస్టులు
పోస్టులు – వెకెన్సీలు:
ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) : 541 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 14
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 జీతం ఉంటుంది. అడ్వాన్స్ ఇంక్రిమెట్లు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్, ఎన్‌పీఎఫ్ ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ: అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మూడు స్టేజీల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష+ గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రత్యేకంగా ప్రిలిమ్స్ మార్కులు తుది మెరిట్ లిస్టులో పరిగణనలోకి రావు. ఫైనల్ ఎంపిక ఫేజ్-II అండ్ ఫేజ్-III స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in
ALSO READ: INCOIS Jobs: డిగ్రీతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, వారం రోజులే గడువు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 541
దరఖాస్తుకు చివరి తేది: జులై 14