RWF Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టెన్త్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. రైల్ వీల్ ఫ్యాక్టరీ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓసారి చూద్దాం.
ఇండియన్ రైల్వేస్ రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF) లో వివిధ ట్రేడ్ లలో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 192
వివిధ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్, ఇంజనీర్, మెకానిక్ మోటార్ వాహనం, టర్నర్, సీఎన్సీ ప్రోగ్రామింగ్ కో- ఆపరేటర్, ఎలక్ట్రీషియలన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ALSO READ: ITI LIMITED: శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకెందుకు ఆలస్యం
వెకెన్సీ వారీగా పోస్టులు:
ఫిట్టర్- 85, ఇంజనీర్-31, మెకానిక్ మోటారు వాహనం-8, టర్నర్-5, CNC ప్రోగ్రామింగ్ కో-ఆపరేటర్ (COE GROUP)-23, ఎలక్ట్రీషియన్-18, ఎలక్ట్రానిక్ మెకానిక్-22 పోస్టులువెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ట్రేడ్/బ్రాంచ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 1
దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమైంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందకు అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఓబీసీ అభ్యర్థులక మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
పోస్టు ఎంపిక ప్రక్రియ: టెన్త్ క్లాస్ వచ్చిన మార్కుల మెరిట్ ఆధరాంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: పోస్టుకు సెలెక్ట్ అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. ఫిట్టర్, మెకానిస్ట్, మెకానిస్ట్ (మోటార్ వెహికల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.12,261 స్టైఫండ్ ఉంటుంది. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.10,899 సైఫండ్ ఇస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rwf.indianrailways.gov.in/
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 192
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 1