ITI LIMITED: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడిఎం, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణవకాశం. ఐటీఐ లిమిటెడ్ బెంగళూరులో వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ఐటీఐ లిమిటెడ్ బెంగళూరు(ITI LIMITED) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. మార్చి 16న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 41
వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్, ఎస్టేట్‌మేనేజ్‌మెంట్, సివిల్, లీగల్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్ సెక్యురిటీ, డేటా సెంటర్, ఐటీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఐటీఐ లిమిటెడ్ బెంగళూరు(ITI LIMITED) లో అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
అడిషనల్ జనరల్ మేనేజర్: 11 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 04 పోస్టులు
చీఫ్ మేనేజర్: 12 పోస్టులు
మేనేజర్: 03 పోస్టులు
డిప్యూటీ మేనేజర్: 01 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 10 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 16
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడిఎం, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగానికి నెలకు 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 38 ఏళ్లు, మేనేజర్‌కు 42ఏళ్లు, చీఫ్ మేనేజర్‌కు 46 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, అడిషనల్ జనరల్ మేనేజర్‌కు 54 ఏళ్లు నిండి ఉండాలి. వయస్సు సడలింపు కూడా ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ధారించారు. నెలకు అడిషనల్ జనరల్ మేనేజర్‌కు రూ.18,500 – రూ.23,900, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.17,500 – రూ.22,300, చీఫ్ మేనేజర్‌కు రూ.16,000 – రూ.20,800, మేనేజర్‌కు రూ.14,500 – రూ.18,700, డిప్యూటీ మేనేర్‌కు రూ.13,000 – రూ.18,250, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు రూ.8,600 – రూ.14,600 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://itiltd.in/
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 41
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 16