BigTV English

Betting Apps: బెట్టింగ్ భూతం.. సజ్జనార్ వార్నింగ్.. మరో యూట్యూబర్‌పై కేసు

Betting Apps: బెట్టింగ్ భూతం.. సజ్జనార్ వార్నింగ్.. మరో యూట్యూబర్‌పై కేసు

Betting Apps: బెట్టింగ్ యాప్స్ అనేవి ఊబి లాంటివి. ఒక్కసారి అందులోకి దిగితే వాటికి అలవాటు పడి, అడిక్ట్ అయ్యి బయటికి రావడం కష్టం. అందుకే వాటికి దూరంగా ఉండడమే మేలు.. అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చాలామంది నెటిజన్లు వారి మాటలు వినడం లేదు. తెలిసి తెలిసి బెట్టింగ్ యాప్స్ భూతానికి బలవుతున్నారు. అందుకే అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. కానీ యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం ఎవ్వరి మాట వినకుండా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరొక ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఈ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం వల్ల చిక్కుల్లో పడక తప్పలేదు.


హెచ్చరికలు పట్టించుకోవట్లేదు

ఇప్పటికే చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చాలా రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. వారికి ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పిన మాట విని చాలామంది యూత్ ఈ బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడ్డారు. దానివల్ల ఎంతోమంది అప్పుల పాలయ్యి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో అప్పటివరకు బెట్టింగ్ యాప్స్‌కు లైట్ తీసుకున్న పోలీసులు, అధికారులు సైతం వీటిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై యాక్షన్ తీసుకున్నారు. అయినా కూడా ఇంకా కొందరు యూట్యూబర్లు అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు.


మోటో వ్లాగర్ నిర్వాకం

మోటో వ్లాగింగ్ అనేది ఇప్పుడు సెపరేట్ వృత్తిలాగా అయిపోయింది. మొదట్లో కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే ఇలాంటి మోటో వ్లాగర్స్ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరికి డిమాండ్ పెరిగింది. తెలుగు మోటో వ్లాగర్స్‌లో ఒకడైన బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ బయ్యా సందీప్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌కు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో బాగానే ఫాలోయింగ్ ఉంది. అలాంటి తను తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ ఆరోపణల ఆధారంగా సూర్యపేట పోలీసులు బయ్యా సన్నీ యాదవ్‌ (Bayya Sunny Yadav)పై కేసు నమోదు చేశారు. టీఎస్ఆర్టీసీ ఎమ్‌డీ సజ్జనార్ సైతం ఈ విషయంపై సీరియస్ అయ్యారు.

Also Read: ఫ్యాన్ చెంప చెల్లుమనిపించిన హీరోయిన్.. స్టేజ్ పైనే.. మరీ దారుణం భయ్యా.!

శిక్ష తప్పదు

‘డబ్బులకు ఆశపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదు. అలా చేసేవారికి చట్టపరంగా శిక్షపడక తప్పదు’ అని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్ (Sajjanar). ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసిన విషయంలో చాలామంది యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారంతా ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఇంకా ప్రమోషన్స్ వల్ల వస్తున్న డబ్బులకు ఆశపడి చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాటికి ప్రమోట్ చేయక ఆపడం లేదు. ఇక ఆ లిస్ట్‌లో బయ్యా సన్నీ యాదవ్ కూడా యాడ్ అయ్యాడు. తనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×