APEDB Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, పీజీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓసారి చూద్దాం. మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్(APEDB) కాంట్రాక్ట్ విధానంలో వివిధ టీమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మార్చి 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22
ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. వివిధ టీమ్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్, ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్, పాలిసి అండ్ లీగల్, గ్రాఫిక్ డిజైన్(స్టాటిక్ అండ్ వీడియో) టీంలల్లో పని చేయాలి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..
అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్: 05
జనరల్ మేనేజర్: 10
మేనేజర్: 07
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 20
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి నెలకు రూ.2,50,000 – రూ.5,00,000, జనరల్ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ. 2,00,000 – రూ.2,50,000, మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.1,50,000 – రూ.2,00,000 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://apedb.ap.gov.in
అర్హత ఉండ ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి నెలకు రూ.2,50,000 – రూ.5,00,000, జనరల్ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ. 2,00,000 – రూ.2,50,000, మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.1,50,000 – రూ.2,00,000 వేతనం ఉంటుంది.
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 20
ALSO READ: JOBS: ఇంటర్, డిగ్రీ అర్హతతో మన హైదరాబాద్‌లోఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..
ALSO READ: SBI Internship 2025: యువతకు గుడ్ న్యూస్..ఇంటర్న్‌షిప్ చేయండి, నెలకు రూ. 16 వేలు పొందండి..