Jobs in Hyderabad: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. యూఎస్ బేస్ డ్ కంపెనీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగం పొందేందుకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వొచ్చు. ఓసారి పూర్తి వివరాలను సవివరింగా చూద్దాం.
[24]7.ai అనే అమెరికా ఆధారిత కంపెనీ హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ చాట్ అండ్ సెమీ-వాయిస్ ప్రక్రియల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య గురించి తెలియజేయలేదు.
విద్యార్హత: ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. US షిఫ్ట్‌లలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: ఈ నెల 21 వరకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వొచ్చు.
ఉద్యోగ ఎంపిక ప్ర్రక్రియ: ఇంటర్వ్వూ ద్వారానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో పర్సనల్ డిటైల్స్, ఆన్ లైన్ అసెస్ మెంట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ స్థలం: ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు NSL SEZ, సర్వే 1, ప్లాట్ 6, NSL అరీనా ఇంటర్నల్ రోడ్, IDA ఉప్పల్, హబ్సిగుడ, హైదరాబాద్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న [24]7.ai వద్ద ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
☀ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారంలో ఐదు రోజులు పని చేయాల్సి ఉంటుంది. రెండు రొటేషనల్ షిఫ్ట్ లు ఉంటాయి. వారాంతపు సెలవులు కూడా ఉంటాయి.
☀ దీంతో పాటు ఉచిత పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం ఉంటుంది. అంతే కాకుండా, కంపెనీ వెహికల్స్ ను రూ. 3,300 రవాణా భత్యం లభిస్తుంది. కంపెనీ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి వైద్య బీమాను కూడా అందిస్తుంది.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలను పొందేందుకు ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
[24]7.ai కంపెనీ గురించి..
ఇది కాలిఫోర్నియాలో ఉన్న కస్టమర్ సర్వీస్ సాఫ్ట్‌వేర్ అండ్ సేవల సంస్థ. ఇది కస్టమర్ సేవను అందించడానికి కృత్రిమ మేధస్సు అండ్ మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగిస్తుంది.
☀ దీనికి టొరంటో, లండన్, సిడ్నీలలో కార్యాలయాలు ఉన్నాయి.
☀ భారతదేశంలో ఈ కంపెనీకి బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
ALSO READ: BOI Recruitment: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా ఉద్యోగాలు..
ALSO READ: NCL Recruitment: సువర్ణవకాశం.. పదో తరగతి అర్హతతో 1765 పోస్టులు, ఇంకా 3 రోజులే గడువు..