BigTV English

Ibrahim Ali Khan: సైఫ్ వారసుడి రౌడీయిజం.. నీ అంతు చూస్తానంటూ ఫిల్మ్ క్రిటిక్‌కు బెదిరింపులు..

Ibrahim Ali Khan: సైఫ్ వారసుడి రౌడీయిజం.. నీ అంతు చూస్తానంటూ ఫిల్మ్ క్రిటిక్‌కు బెదిరింపులు..

Ibrahim Ali Khan: నెపోటిజం అనేది ప్రతీ రంగంలోనూ ఉంది. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజంపై ఉన్న నెగిటివిటీ అంతా ఇంతా కాదు. అందుకే బీ టౌన్‌లో ఎవరైనా నెపో కిడ్స్ కొత్తగా డెబ్యూ చేస్తున్నారంటే చాలు.. వారి యాక్టింగ్‌పై ముందే ట్రోల్స్ వచ్చేస్తుంటాయి. ఆ ట్రోల్స్‌ను కొంతకాలం వరకు సైలెంట్‌గా భరించాలి అనే క్లారిటీ చాలామంది ఉన్నా.. కొందరు మాత్రం వారిపై వచ్చే ట్రోల్స్‌ను చూస్తూ ఉండలేక ఎక్స్‌ట్రా కష్టాలు కొనితెచ్చుకుంటారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా అదే పనిచేశాడు. ఒక ఫిల్మ్ క్రిటిక్‌ను ఇబ్రహీం బెదిరించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


నెపో కిడ్ ప్రతాపం

సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) కూడా చాలామంది నెపో కిడ్స్ లాగా తన మొదటి సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేశాడు. ఇబ్రహీం, ఖుషీ కపూర్ (Khushi Kapoor) జంటగా నటించిన ‘నాదానియాన్’ (Nadaaniyan) అనే మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలయినప్పటి నుండి ఏదో ఒక విధంగా ట్రోలింగ్ ఎదుర్కుంటూనే ఉంటోంది. ఇబ్రహీం, ఖుషీ యాక్టింగ్ చాలా దారుణంగా ఉందని, చూడడానికి కూడా వాళ్లు అసలు బాలేదని సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ కామెంట్స్ అన్నీ చూసి ఇబ్రహీంకు కోపం వచ్చింది. పాకిస్థానీ ఫిల్మ్ క్రిటిక్ అయిన తామూర్ ఇక్బాల్ అనే వ్యక్తపై తన ప్రతాపం చూపించాడు.


మాటలు అదుపులో పెట్టుకో

‘నాదానియాన్’ సినిమాకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి దానికి నెగిటివ్ రివ్యూ అందించాడు తామూర్ ఇక్బాల్. ఆ స్టోరీకి ఇబ్రహీం స్పందించాడు. ‘తామూర్ అనే పేరు దాదాపు తైమూర్‌లాగానే ఉంది. అంటే మీది మా తమ్ముడి పేరు. కానీ నీకు వాడి మొహం మాత్రం రాలేదు. నీది చెత్త మొహం. నీ మాటలను నువ్వు అదుపులో పెట్టుకోలేవు. అవి కూడా నీలాగే సంబంధం లేకుండా ఉన్నాయి. నాకు నిన్ను, నీ కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తుంది. ఏదో ఒకరోజు నిన్ను రోడ్డుపై చూస్తే నువ్వు ఉన్న పరిస్థితి కంటే ఇంకా దారుణమైన స్థితికి వచ్చేలా చేస్తా’ అంటూ ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చేశాడు ఇబ్రహీం అలీ ఖాన్.

Also Read: వచ్చే ఏడాదే రిలీజ్.. ఆ చిత్రాల స్ఫూర్తితోనే.!

వ్యంగ్యంగా కామెంట్స్

ఇబ్రహీం తనకు చేసిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి దానిని ఓపెన్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు తామూర్ ఇక్బాల్ (Tamur Iqbal). అంతే కాకుండా దీంతో పాటు మరికొన్ని స్టోరీలు కూడా షేర్ చేశాడు. ఈ ఏడాది సైఫ్ అలీ ఖాన్‌కు మాత్రమే హ్యాపీ హోళీ అని, తన కొడుకుకు మాత్రం కాదని కౌంటర్ వేశాడు. కరీనా కపూర్ తలచుకుంటే తనకు, ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన మనస్పర్థలు దూరం చేయగలదు అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇక ఈ స్టోరీలు అన్నీ చూడలేక తామూర్‌ను ఇన్‌స్టాలో బ్లాక్ చేశాడు ఇబ్రహీం. ఈ విషయాన్ని కూడా తన స్టోరీలో షేర్ చేశాడు తామూర్ ఇక్బాల్. ఇబ్రహీం అలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాకపోయినా తనను పదేపదే తామూర్ టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదని బాలీవుడ్ ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×