BigTV English

SBI Internship 2025: యువతకు గుడ్ న్యూస్..ఇంటర్న్‌షిప్ చేయండి, నెలకు రూ. 16 వేలు పొందండి..

SBI Internship 2025: యువతకు గుడ్ న్యూస్..ఇంటర్న్‌షిప్ చేయండి, నెలకు రూ. 16 వేలు పొందండి..

SBI Internship 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రతి సంవత్సరం యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తూ, దేశ వ్యాప్తంగా యువతలో సామాజిక సేవా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా, SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫెలోషిప్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు 13 నెలల పాటు గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్‌లలో భాగస్వామ్యులు కావచ్చు. ఇందుకు వారికి మొత్తం రూ. 3,37,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ క్రమంలో నెలకు రూ. 16వేల వేతనంతోపాటు అదనపు అలవెన్సులు కూడా అందిస్తారు.


SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 – ముఖ్యాంశాలు
-ప్రోగ్రామ్ పేరు SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26
-సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇతర ప్రముఖ NGOలు
-దరఖాస్తు విధానం ఆన్‌లైన్
-దరఖాస్తు రుసుము అవసరం లేదు
-ఇంటర్న్‌షిప్ వ్యవధి 13 నెలలు
-భత్యం నెలకు రూ. 16,000 + అదనపు ప్రయోజనాలు
-మొత్తం ఆర్థిక సహాయం రూ. 3,37,000
-చివరి తేదీ మే 31, 2025
-అధికారిక వెబ్‌సైట్ https://change.youthforindia.org

SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 – ముఖ్య తేదీలు
-ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 2025
-చివరి తేదీ: మే 31, 2025
-ఇంటర్న్‌షిప్ ప్రారంభం: అక్టోబర్ 2025
-ఇంటర్న్‌షిప్ ముగింపు: డిసెంబర్ 2026


అర్హత ప్రమాణాలు
-SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలను కలిగి ఉండాలి:
-విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ (అక్టోబర్ 1, 2025కి ముందు పూర్తి చేయాలి)
-వయోపరిమితి: 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి
-భారతదేశ పౌరులై ఉండాలి
-నేపాల్, భూటాన్ పౌరులు
-భారతదేశ విదేశీ పౌరులు (OCI)

Read Also: MM Keeravani:83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో కీరవాణి .

ప్రయోజనాలు
-SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఎంపికైన అభ్యర్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది:
-నెలకు భత్యం: రూ. 16,000
-ప్రాజెక్ట్ ఖర్చుల భరణం: రూ. 1,000
-రవాణా ఖర్చులు: రూ. 2,000
-ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత: రూ. 90,000
-3AC రైలు ఛార్జీలు: ప్రాజెక్ట్ సైట్‌కు రవాణా కోసం అందించబడుతుంది
-ఆరోగ్య, ప్రమాద బీమా: పూర్తిగా కవరేజీ కలిగిన బీమా పాలసీ
-గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం: సామాజిక అభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తుంది

దరఖాస్తు విధానం
-దీని కోసం అభ్యర్థులు తమ దరఖాస్తును 2025 మే 31 లోపు సమర్పించాలి.
-ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://change.youthforindia.orgను సందర్శించండి.
-హోమ్‌పేజ్‌లో “ఆన్‌లైన్ అప్లికేషన్” లింక్‌ను క్లిక్ చేయండి.
-పర్సనల్ డీటైల్స్, విద్యార్హతలు, వయస్సు వంటి వివరాలను పూర్తి చేయండి.
-అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి (ఫోటో, విద్యార్హత ధృవీకరణ పత్రాలు).
-ఆ తర్వాత సమర్పించు బటన్‌ను క్లిక్ చేయండి.
-దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత, అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ వివరాలు SMS, ఇమెయిల్ ద్వారా అందించబడతాయి.

ఎంపిక ప్రక్రియ
-ముందుగా సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌బోర్డింగ్ చేసి జాయినింగ్ లెటర్ అందిస్తారు.
-మొత్తం దరఖాస్తుదారులలో కేవలం 2% మాత్రమే చివరి దశలో ఎంపిక అవుతారు.

ఎందుకు ఇదే బెస్ట్
-నెలకు రూ. 16,000 + అదనపు ప్రయోజనాలు
-గ్రామీణ ప్రాజెక్ట్‌ల ద్వారా సామాజిక సేవలో భాగమవ్వడం
-ఇది పూర్తయ్యాక ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడం
-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా గుర్తింపు పొందే అవకాశం

Tags

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×