BigTV English

DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్

DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్

Surveyor Jobs: డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. వైజాగ్ లోని సీతమ్మదారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. మరీ ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 25వ తారీఖున దరఖాస్తు గడువు ముగియనుంది.

ALSO READ: Indian Navy Jobs: ఇండియన్ నేవిలో 270 ఉద్యోగాలు.. రేపే లాస్ట్..!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL).. కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22

ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కన్సల్టెంట్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్, హైడ్రో గ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్(ఓ/పీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వారీగా..

కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04

ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01

హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12

ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01

లీగల్‌ కన్సల్టెంట్: 01

రెసిడెంట్ మేనేజర్‌: 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు వయస్సు 45 నుంచి 60 ఏళ్లు మించి ఉండరాదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ పోస్టులకు, కన్సల్టెంట్ పోస్టులకు నెలకు రూ.1,50,000 – రూ.2,00,000 జీతం ఉంటుంది. ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్ ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.65,000 జీతం ఉంటుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులకు రూ.25,000-రూ.40,000 జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.1,00,000 – రూ.1,20,000 జీతం  ఉంటుంది. లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.50,000- రూ.70,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు కు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

Also Read: C-DAC HYDERABAD: బీటెక్ అర్హతతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. రూ.22లక్షల జీతం భయ్యా..

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.dredge-india.com/

అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇదే మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×