C-DAC HYDERABAD: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఈ, బీటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు మంచి అవకాశం. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీ డ్యాక్ హైదరాబాద్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఏడాదికి రూ.22లక్షల జీతం ఉంటుంది.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC-HYDERABAD) సైంటిస్ట్-సి పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చి 23వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ లో సైంటిస్ట్ సీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సైంటిస్ట్ సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 33 ఏళ్ల వయస్సు మించరాదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: స్కిల్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్కిల్ టెస్ట్: ఈ టెస్ట్ లో కంప్యూటర్ నెట్ వర్క్స్, ఇంటర్ నెట్ వర్కింగ్ డివైజెస్, క్లౌడ్ కంప్యూటింగ్ లో నాలెడ్జ్ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టెమ్స్ వచ్చి ఉండాలి. నెట్ వర్క్ సెక్యూరిటీ కాన్సెప్ట్ లో లోతైన అవగాహన ఉండాలి. సెక్యూరిటీ సొల్యూషన్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఐటీ, ఐసీటీ, ఐసీఎస్ ఎన్విరాన్ మెంట్ లో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు. అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ యాప్ అనాలిసిస్ తెలిసి ఉండాలి.
వేతనం: ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.22లక్షల జీతం ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 23
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.cdac.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో రెండు ఉద్యోగాలు కలవు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఏడాదికి రూ.22లక్షల జీతం ఇవ్వనున్నారు. మార్చి 23 దరఖాస్తు గడువు ఉంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలో 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23
జీతం: ఏడాదికి రూ.22లక్షల ఉంటుంది.