Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. సీనియర్ హీరోలు సపోర్టింగ్ రోల్స్ చేయరు.. ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలుగానే నటిస్తారు. చిరు, వెంకీ, బాలయ్య ఇప్పటికీ హీరోలుగా నటిస్తున్నారు. అయితే నాగ్ మాత్రం.. ఈసారి కొత్తగా ట్రై చేసాడు. హీరోగా కాకుండా సపోర్ట్ రోల్స్ కు ఓకే చెప్పి షాక్ ఇచ్చాడు. ఒకటి కాదు.. ఒకేసారి రెండు సినిమాలలో కూడా మంచి కీ రోల్స్ లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు ఏంటంటే.. కుబేర ఒకటి.. కూలీ ఒకటి.
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమా కథ నచ్చడంతో నాగ్ ఈ పాత్రకు ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాలో ఐటీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కాకుండా నాగ్ మరో సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు. అదే కూలీ.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు ఒక కారణం.. ఇందులో అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటించడమే. ఇప్పటికే నాగ్ పోస్టర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hari Hara Veera Mallu: వీరమల్లు మనసు కొల్లగొట్టిన చిన్నది.. యమా అందంగా ఉంది
ఇక నాగ్.. సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకుంటాడా.. ? లేక హీరోగా మళ్లీ సినిమా చేస్తాడా.. ? అంటే.. కచ్చితంగా చేస్తాడు అని చెప్పుకోవచ్చు. 60 ఏళ్ళు దాటినా నాగ్ బాడీ కానీ, లుక్స్ కానీ ఇంకా వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అంతలా బాడీని మెయింటైన్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే నాగ్ స్టైలిష్ లుక్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదంటే అతిశయోక్తి కాదు.
గతేడాది నా సామిరంగా సినిమాతో నాగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని తరువాత రైటర్ ప్రసన్న కుమార్ ను డైరెక్టర్ ను చేసే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే నాగ్ కు ప్రసన్న కుమార్ చెప్పిన ఆ కథ అంతగా సాటిస్పై చేయలేదని టాక్. అందుకే ఆయనను పక్కన పెట్టాడట కింగ్. ఇక ప్రసన్న కుమార్ కాకుండా నాగ్.. తమిళ్ డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ నవీన్ తో నాగ్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నవీన్ చెప్పిన కథ..మన్మథుడుకు బాగా నచ్చిందని, ఆయన వెంటనే సెట్ మీదకు తీసుకెళ్లమని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. స్టోరీ లైన్ నచ్చినా .. కొద్దిగా మార్పులు చేర్పులు అవసరమని, అవి మార్చమని నాగ్ సూచించాడట. అది డైరెక్టర్ కు నచ్చలేదని టాక్ నడుస్తోంది. మరి నాగ్ సలహాలను నచ్చని నవీన్.. సైలెంట్ గా సైడ్ అయ్యినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం క్లారిటీ రానుంది.