CSIR-NAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం ఇది. ఇంటర్ పాసైన వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్ – నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (CSIR- NAL) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ జాబ్స్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా కల్పిస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
బెంగళూరు, సీఎస్‌ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్(CSIR-NAL) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 26
సీఎస్‌ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్ పీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ), జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్): 09
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ): 05
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎఫ్&ఏ): 07
జూనియర్ స్టెనోగ్రాఫర్: 05
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 16
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 20
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్ పాసై ఉండాలి. అలాగే ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 మే 20వ తేదీ నాటికి జేఎస్‌ఏకు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండును. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 – రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100 జీతం ఉండును.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruit.nal.res.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 – రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100 జీతం ఉండును. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. అభ్యర్థుల్లారా ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 26 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 16