L2 Empuraan Collection: ఈరోజుల్లో మలయాళ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. పైగా స్టార్ హీరోల సినిమాలు అంటే అక్కడ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయని ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోతున్నారు. తాజాగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2 ఎంపురాన్’పై కూడా ప్రేక్షకుల్లో అవే అంచనాలు ఉన్నాయి. మోహన్ లాల్ లాంటి స్టార్ ఒక సినిమాలో నటిస్తున్నాడంటే కచ్చితంగా అది కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్‌లో దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ ఒక యంగ్ హీరో సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ కూడా ‘ఎల్2 ఎంపురాన్’ క్రాస్ చేయలేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మొత్తానికి ‘ఎల్2 ఎంపురాన్’ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు బయటికొచ్చాయి.
యంగ్ హీరోతో పోటీ
పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించిన సినిమానే ‘ఎల్2 ఎంపురాన్’. ఇదే కాంబినేషన్‌లో 2019లో విడుదలయిన ‘లూసీఫర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అప్పటినుండి ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలా దాదాపు అయిదేళ్లు కష్టపడి ఫస్ట్ పార్ట్ కంటే భారీ బడ్జెట్‌తో, మరింత యాక్షన్ యాడ్ చేసి ‘ఎల్2 ఎంపురాన్’ను తెరకెక్కించాడు పృథ్విరాజ్ సుకుమారన్. అనుకున్నట్టుగానే మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ టోవినో థామస్ హీరోగా నటించిన ‘2018’ మూవీ కలెక్షన్స్‌ను మాత్రం ‘ఎల్2 ఎంపురాన్’ క్రాస్ చేయలేకపోయింది.
గ్రాస్ కలెక్షన్స్
కేవలం కేరళలోనే ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాకు రూ.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఆ మాత్రం కలెక్షన్స్ రావడం కామన్. కానీ ఇది ‘2018’ మూవీ గ్రాస్ కలెక్షన్స్‌ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. టోవినో థామస్ హీరోగా నటించిన ‘2018’ మూవీకి కేవలం కేరళలోనే రూ.89.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే టోవినో థామస్ లాంటి యంగ్ హీరో సినిమాను మోహన్ లాల్ లింటి స్టార్ హీరో సినిమా క్రాస్ చేయలేకపోయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ విషయంలో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ‘2018’తో పోలిస్తే ‘ఎల్2 ఎంపురాన్’ ఇంకా రూ.3 కోట్ల వెనకబడే ఉంది.
Also Read: మా అందరికీ లైఫ్ ఇచ్చావు.. సంపత్ నంది నిజంగా ఇది చేశాడా.?
ఓటీటీలో విడుదల
‘ఎల్2 ఎంపురాన్’ (L2 Empuraan) తర్వాత మరెన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చాయి. అలా థియేటర్లలో పోటీ పెరగడం వల్ల ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మెల్లగా తగ్గుతూ వచ్చింది. మొత్తానికి కేరళలో రూ.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినా ‘2018’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది ఈ సినిమా. ఇక థియేటర్లలో విడుదలయ్యి చాలాకాలం అవుతుండడంతో ‘ఎల్2 ఎంపురాన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 24 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. మొత్తానికి ‘ఎల్2 ఎంపురాన్’ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అందుకుంది.