BigTV English

Allu arjun Sri leela: ప్రమోషన్స్ తో చిక్కులు.. అల్లు అర్జున్, శ్రీలీలపై ఫిర్యాదులు

Allu arjun Sri leela: ప్రమోషన్స్ తో చిక్కులు.. అల్లు అర్జున్, శ్రీలీలపై ఫిర్యాదులు

ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సినీ నటులకు కూడా ఈ విమర్శలు తప్పలేదు. ఇక గుట్కా, ఖైనీ కంపెనీల యాడ్స్ విషయంలో కూడా నటీనటులపై ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న అల్లు అర్జున్, శ్రీలీలపై కూడా పోలీస్ కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐఎస్ఎఫ్ తెలిపింది.


ఎందుకీ వివాదం..?
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు సినీ తారలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయి. అల్లు అర్జున్, శ్రీలీల కూడా ఇలాగే కొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారు. వారి ఫొటోలతో ఆయా సంస్థలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆ విద్యాసంస్థలు కూడా కొంతమంది ర్యాంకర్ల ఫొటోలు ప్రచురించాయి. ఆ ఫొటోలతోనే అసలు గొడవ మొదలైంది.

ఏఐఎస్ఎఫ్ డిమాండ్..
సాధారణంగా కాంపిటీటివ్ పరీక్షల ఫలితాలు వస్తే తమకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, సెకండ్ ర్యాంక్ వచ్చిందని.. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు, ఫొటోలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటాయి విద్యాసంస్థలు. అయితే కొన్నిసార్లు ఫస్ట్ ర్యాంకర్లు రెండు మూడు కాలేజీల్లో చదివినట్టు ఎవరికి వారే ప్రకటనలు ఇస్తుంటారు. వారు తమ విద్యార్థులేనని చెబుతుంటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా ఇలాగే జరిగిందని ఏఐఎస్ఎఫ్ వాదిస్తోంది. ఒకే విద్యార్థి వివిధ కాలేజీల్లో చదువుతున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారం కూడా అల్లు అర్జున్, శ్రీలీల వంటి సినీ నటీనటులతో జరుగుతోందని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. ఆయా విద్యాసంస్థలతోపాటు, వాటి ప్రచారకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


విద్యార్థి సంఘాలు ప్రైవేటు విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం సహజమే. అయితే ఆ వివాదంలోకి అల్లు అర్జున్, శ్రీలీల కూడా రావడంతో సోషల్ మీడియాలో ఈ ఆందోళన సంచలనంగా మారింది. విద్యాసంస్థలతోపాటు ప్రచారకర్తలపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఏఐఎస్ఎఫ్ నేతలు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఏఐఎస్ఎఫ్ నేతలు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదుని పోలీసులు తీసుకున్నారా, కంప్లయింట్ నమోదు చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

కష్టకాలమే..
రాబోయే రోజుల్లో సినీ తారల ప్రచారంపై మరింత ఫోకస్ పెరిగే అవకాశముంది. తెలిసో తెలియకో ఇటీవల బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారంతా ఇబ్బంది పడ్డారు. ఇక గుట్కా కంపెనీలు తెలివిగా మౌత్ ఫ్రెష్ నర్ల పేరుతో టాప్ హీరోలతో అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తుంటాయి. వీటికి కూడా సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఇక కూల్ డ్రింక్స్ ని ప్రమోట్ చేస్తున్న హీరోలని కూడా కొంతమంది టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. చిన్నపిల్లలు హీరోలను ఫాలో అవుతూ కూల్ డ్రింక్ లు తాగి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో.. హీరోలు, హీరోయిన్లు.. తాము ప్రమోట్ చేసే బ్రాండ్ ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నమాట.

Related News

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Big Stories

×