SSC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) -2025 ఇయర్‌కు గానూ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, వెకెన్సీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 ఏడాదికి గానూ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్ ‘డి’ ఉద్యోగాల నియామకానికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాతీయ స్థాయి పరీక్ష భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 261
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గేజిటెడ్) & డి (గ్రూప్ సి) పోస్టుల ఉన్నాయి.
విద్యార్హత: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాసై ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. వయస్సు 2025 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాసై ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యాలు కలిగి ఉండాలి. 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 26
ఫీజు చెల్లింపుకు చివరి తేది: 2025 జూన్ 27
దరఖాస్తు సవరణకు డేట్స్: 2025 జూలై 1 నుంచి జూలై 2 వరకు
ఎగ్జామ్ డేట్స్: 2025 ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 11 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎగ్జామ్: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్కులు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 మార్కులు వస్తాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష వ్యవధి: 2 గంటలు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, కంప్యూట్ బేస్ డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి)
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ALSO READ: DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56,100 జీతం, ఇంకా 2 రోజులే?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 261
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 26