Bangalore News: కర్నాటక రాష్ట్రంలో దారుణ హత్య జరిగింది. రాజధాని నగరం బెంగళూరు శివార్లలోని ఓయో హోటల్ రూంలో ఓ కిరాతకుడు తన ప్రేయసిని అత్యంత కిరాతకంగా చంపాడు. 17 సార్లు కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డాడు. నగర శివారులోని కెంగేరి ప్రాంతంలోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లో మూడు రోజుల క్రితం ఈ దారుణ హత్య జరిగింది. అయితే సోమవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని 25 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యశష్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
సుబ్రహ్మణ్యపుర పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. హరిణి అనే మహిళకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. హరిణి (33) ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. అయితే, గత కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో హరిణిని బెదిరించారు. దీంతో యశష్ ను అవాయిడ్ చేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఇదే విషయం యశష్ కు తెలియజేయడంతో.. అతడు ఈ హత్యకు పాల్పడినట్టు సుబ్రహ్మణ్యపుర పోలీసులు తెలిపారు.
హరిణిని యశష్ ప్లాన్ ప్రకారం చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కాల్ చేసి.. ఓయో హోటల్ రూంకి పిలిచినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కత్తితో దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 17 సార్లు కత్తి పోట్లు పొడిశాడని పోలీసులు స్పష్టం చేశారు.
ALSO READ: Hyderabad : ఎయిర్‌పోర్ట్‌లో యువతి అరెస్ట్.. ఎలా దొరికిపోయిందంటే..
ఓయో హోటల్‌లో జూన్ 6న ఈ దారుణ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. గడువు కంటే ఎక్కువ సమయం గది తాళం వేసి ఉండటంతో అక్కడ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలిపారు. వెంటనే అక్కడ యాజమాన్యం పోలీసులు సమాచారం ఇచ్చారు. హత్య ఘటన వెలుగు చూడటంతో సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అనంతరం నిందితుడు యశష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.