OTT Movie : దెయ్యాలకు చిన్నా పెద్ద తేడా ఉండదు అని చెబుతుంటారు. అలాగే ఒక చిన్న పిల్లవాడు, తన చుట్టూ చనిపోయిన వాళ్ల ఆత్మలు తిరుగుతున్నాయని, వాటిని తాను చూస్తున్నానని చెబుతాడు. పైగా అవి అతనితో మాట్లాడతాయి, భయపెడతాయి, ఆ అబ్బాయి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ఒక సైకాలజిస్ట్ ఈ అబ్బాయికి ఉన్న సమస్యను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ఆత్మలు నిజమైనవేనా? లేక బాలుడి ఊహలా? ఈ రహస్యం వెనుక దాగిన సత్యం ఏమిటి? అనేది తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కోల్ సీర్ (హేలీ జోయెల్ ఓస్మెంట్) 9 ఏళ్ల బాలుడు. తనకు చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూడగల శక్తి ఉందని చెప్తూ ఉంటాడు. ఈ ఆత్మలు తాము చనిపోయాం అన్న విషయం కూడా తెలియకుండా, కోల్ సహాయం కోరుతూ అతన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. కోల్ దగ్గర ఉన్న ఈ శక్తి అతని స్కూల్ లైఫ్ ను, స్నేహాలను, తల్లి లిన్ (టోనీ కొలెట్)తో బంధాన్ని దెబ్బతీస్తుంది. ఆమె అతని వింత ప్రవర్తనను అర్థం చేసుకోలేక బాధపడుతుంది.
ఈ క్రమంలోనే డాక్టర్ మాల్కమ్ క్రో (బ్రూస్ విల్లిస్) అనే ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కోల్‌కు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. మాల్కమ్, గతంలో ఒక రోగిని కాపాడలేకపోయిన ట్రామాతో సతమతమవుతూ, కోల్ కేసులో రిడెంప్షన్ కోరుకుంటాడు. అతను కోల్ కు ఉన్న ఆత్మలను చూసే శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ క్రమంలో అతని వైవాహిక జీవితం, తన భార్య అన్నా (ఒలివియా విలియమ్స్)తో సంబంధం క్షీణిస్తున్నట్లు కనిపిస్తుంది.
కోల్, మాల్కమ్ సహాయంతో తన భయాలను ఎదుర్కొని, ఆత్మలతో కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటాడు. వాటి అసంపూర్ణ కోరికలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలోనే కోల్ ను ఒక చిన్న అమ్మాయి ఆత్మ తన మరణం వెనుక దాగిన రహస్యాన్ని బయట పెట్టడానికి సహాయం చేయమని కోరుతుంది. ఇంతకీ ఆ పాప ఎవరు? ఎలా చనిపోయింది? ఆమె చావు వెనక ఉన్న రహస్యం ఏంటి? దాన్ని కోల్ ఎలా బయట పెట్టాడు? అనేవి తెరపై చూసి తెలుసుకోవలసిన అంశాలు.
Read Also : పనివాడితో ఓనర్ భార్య… ఐలాండ్ లో ఒంటరిగా ఇదేం పని ?
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హర్రర్ థ్రిల్లర్ పేరు ‘The Sixth Sense’. 1999లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిలడెల్ఫియాలో జరిగే హార్ట్ టచింగ్ సస్పెన్స్ ఫుల్ కథ. Hotstarలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు IMDbలో 8.2 రేటింగ్ ఉంది. ఇక ఇందులో బ్రూస్ విల్లిస్, హేలీ జోయెల్ ఓస్మెంట్, టోనీ కొలెట్, ఒలివియా విలియమ్స్, డోనీ వాల్‌బర్గ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎం. నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ చిత్రం సైకలాజికల్ డెప్త్, ఎమోషనల్ బాం డింగ్, అదిరిపోయే సస్పెన్స్‌తో కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది.