E-Paper
Advertisement

APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
Advertisement

APSRTC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ బిగ్ గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ పాసైన వారికి ఇది బంగారు లాంటి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, విద్యార్హత, దరఖాస్తు విధానం, అప్లికేషణ్ ఫీజు, జిల్లాల వారీగా వెకెన్సీ వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)లో 281 అప్రెంటిస్‌ ఖాళీలను నింపేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న అప్రెంటిషిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 4 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 281

జిల్లాల వారీగా వెకెన్సీ వివరాలు..

Advertisement

చిత్తూరు : 48 పోస్టులు

తిరుపతి: 88 పోస్టులు

నెల్లూరు: 91 పోస్టులు

ప్రకాశం: 54 పోస్టులు

వివిధ ట్రేడుల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్) ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (దరఖాస్తు అనంతరం ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌ నుంచి రెజ్యూమ్ ను డౌన్‌లోడ్‌ చేసి వివరాలు నమోదు చేసి నోటిఫికేషన్‌ లో చూపించిన సర్టిఫికెట్లను జత అడ్రస్ కు పంపించాలి.)

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది.

అడ్రస్: ప్రిన్సిపల్‌, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజి, కాకుటూర్‌, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు చివరి తేది: 2025  అక్టోబర్ 4

సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను పంపడానికి చివరి తేది: 2025 అక్టోబర్ 6

ALSO READ: DDA Notification: డీడీఏలో 1732 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెంబర్ వన్ జాబ్ భయ్యా.. చివరి తేది ఇదే

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×