Asia Cup 2025 : సాధారణంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైటెన్షన్ వాతావరణం ఉంటుంది. కానీ ఆసియా కప్ 2025లో మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో రెండింటిలో ఎందులో కూడా ప్రభావం కనిపించలేదు. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడతాడని పేర్కొనడం గమనార్హం. అయితే అతను అన్న వెంటనే ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ డకౌట్ అయ్యాడు.
Also Read : Asia Cup 2025 : సూపర్ 4లో టీమిండియాతో మ్యాచ్.. బెదిరింపులకు దిగిన పాక్… బాయ్ కాట్ చేస్తామని!
మరోవైపు టీమిండియా చేతిలో కూడా డకౌట్ అయ్యాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అయూబ్ బుమ్రా కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో సిక్స్ లు కొడతాడని పేర్కొన్న అతను బుమ్రా కి ఒక్క రన్ కూడా కొట్టకుండా క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వడం ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు యూఏఈతో జరిగిన మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. మూడు మ్యాచ్ ల్లో కూడా 0 (1), 0 (1), o (2) మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం విశేషం. అలాంటి బౌలర్ 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడతాడంటే ఎవరైనా నమ్ముతారా..? అంటూ పాకిస్తాన్ కి కౌంటర్ ఇస్తున్నారు టీమిండియా అభిమానులు. 6 బంతుల్లో 6 సిక్స్ లేమో కానీ.. ఇప్పటి వరకు 3 మ్యాచ్ ల్లో 3 కోడిగుడ్లు పెట్టాడు. మరో మూడు కూడా పెడతాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. టీమిండియా పై పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైనప్పటికీ.. యూఏఈ, ఒమన్ తో విజయం సాధించి సూపర్ 4 కి అర్హత సాధించింది.
దీంతో సూపర్ 4లో ఈనెల 21న దుబాయ్ వేదికగా మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగబోతుంది. వాస్తవానికి సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. వాస్తవానికి పాకిస్తాన్ 20 ఓవర్లలో 127 పరుగులు చేయగా.. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనాన్ని తిరస్కరించారు. ఘోర అవమానంగా భావించిన పీసీబీ.. టీమిండియా ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం గురించి పీసీబీ పై ఐసీసీ కూడా సీరియస్ అయినట్టు సమాచారం. ఐసీసీ సీరియస్ కావడంతో మ్యాచ్ ఆడకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందని..దాదాపు రూ.285 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని గంట ఆలస్యంతో మ్యాచ్ ఆడింది పాకిస్తాన్ జట్టు.