BigTV English

Hebba Patel Odela 2: నా పాత్ర అంతా అక్కడే మగ్గిపోతుంది.. ‘ఓదెల 2’ స్టోరీ లీక్ చేసిన హెబ్బా

Hebba Patel Odela 2: నా పాత్ర అంతా అక్కడే మగ్గిపోతుంది.. ‘ఓదెల 2’ స్టోరీ లీక్ చేసిన హెబ్బా

Hebba Patel Odela 2:హెబ్బా పటేల్(Hebba Patel).. ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా కుర్రకారు హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి కుర్రకారు క్రష్ గా మారిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని, భవిష్యత్తులో పెద్ద రేంజ్ కు వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే మీడియం రేంజ్ హీరోయిన్గా కూడా సెటిల్ అవ్వలేకపోయింది. ఇప్పటికీ ఈమె సినిమాలను రెగ్యులర్గా చేస్తూనే ఉంది. కానీ ఏ ఒక్క మూవీ కూడా ఈమె రేంజ్ ను పెంచలేకపోయింది. అయితే ‘ఓదెలా రైల్వే స్టేషన్’ సినిమా మాత్రం ఈమె కెరియర్ కు మంచి ప్లస్ గా మారిందని చెప్పవచ్చు.


సినిమా స్టోరీ లీక్ చేసిన హెబ్బా పటేల్..

కరోనా సమయంలో ఈ సినిమా రావడం.. పైగా ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవడంతో అప్పట్లో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అటు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఇటు హెబ్బా పటేల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా ‘ఓదెలా 2’ కూడా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పైగా శంకర్ పిక్చర్స్ వారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు విషయాలు పంచుకోగా.. అటు హెబ్బా పటేల్ కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ స్టోరీ లీక్ చేసింది.


నా పాత్ర మొత్తం అక్కడే మగ్గిపోతుంది – హెబ్బా పటేల్..

హెబ్బా పటేల్ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఓదెలా 2 సినిమాలో నాకు – తమన్నా(Tamannaah)కు మధ్య ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయి. ఇందులో తమన్నా నాకు అక్క పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం నేను జైలులోనే కనిపిస్తాను. మొదటి భాగంలో నా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించిందో.. ఇప్పుడు ఓదెల 2 లో కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా మొదటి భాగం కంటే కూడా ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకం నాలో ఉంది ” అంటూ స్టోరీని కాస్త లీక్ చేస్తూ.. తన పాత్ర మొత్తం జైలులోనే మగ్గిపోతుంది అని చెప్పకనే చెప్పేసింది. హెబ్బా పటేల్. మొత్తానికైతే హెబ్బా పటేల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా పై అంచనాలు పెంచేశాయి. అటు తమన్నా కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఈ ఓదెలా 2 సినిమా తప్ప మరో సినిమా లేదు. పైగా ఇందులో ఆమె తొలిసారిగా నాగ సాధ్వి క్యారెక్టర్ పోషిస్తోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యి తమన్నాకు సక్సెస్ వస్తే..మళ్లీ ఆమెకు తెలుగులో అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. మరి ఇద్దరి హీరోయిన్లకి లైఫ్ అండ్ డెత్ గా మారిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Vani Ganapathy: కమల్ హాసన్ మాయగాడే కాదు పిసినారి కూడా.. మాజీ భార్య సంచలన కామెంట్స్..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×