DSH Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ పాసైన అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏలూరు జిల్లా, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆస్పత్రులలో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధిచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఏపీలోని ఏలూరు జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో 31 పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 19 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: HAL Recruitment: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు, మంచి వేతనం.. 4 రోజులే గడువు
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 31
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. బయో మెడికల్ ఇంజినీరింగ్, ఆడియో మెట్రిషియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. థియేటర్ అసిస్టెంట్, ప్లంబర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ/ అడెండెంట్స్, పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ఒప్పంద ఉద్యోగాలు
బయో మెడికల్ ఇంజినీరింగ్- 01
ఆడియోమెట్రిషియన్- 05
రేడియోగ్రాఫర్- 03
ల్యాబ్ టెక్నీషియన్- 01
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..
థియేటర్ అసిస్టెంట్- 04
ప్లంబర్- 02
ఆఫీస్ సబార్డినేట్- 01
జనరల్ డ్యూటీ/ అడెండెంట్స్- 11
పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్- 03
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 19
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ, డిగ్రీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ పాసై ఉండాలి. అలాగే సంబంధిత కోర్సు సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి 42 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు బయో మెడికల్ ఇంజినీరింగ్‌కు రూ.54,060 జీతం ఉండగా.. ఆడియోమెట్రిషియన్, ల్యాబ్ టెక్నీషియన్‌కు నెలకు రూ.32,670 జీతం, రేడియోగ్రాఫర్ కు రూ.35,570 జీతం, ఇతర పోస్టులకు రూ.15,000 జీతం ఉంటుంది.
చిరునామా: అప్లికేషన్ ను పూర్తి చేసి దరఖాస్తు ఫామ్ ను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, ఏలూరు డీసీహెచ్ఎస్ ఆఫీస్ లో సమర్పించాలి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 31
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 19
ఇది కూడా చదవండి: BEL Recruitment: బీటెక్ పాసయ్యారా..? వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. నెలకు రూ.55,000 జీతం