HAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని అనుసరించి ఐటీఐ, డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 18 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 98
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ (ఫిట్టర్), ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్), ఆపరేటర్ (మెషనిస్ట్), ఆపరేటర్ (షీట్ మెటల్ వర్కర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు..
డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్): 20
డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్): 26
ఆపరేటర్(ఫిట్టర్): 34
ఆపరేటర్(ఎలక్ట్రీషీయన్): 14
ఆపరేటర్(మెషనిస్ట్): 03
ఆపరేటర్(షీట్ మెటల్ వర్కర్): 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 4
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 18
వయస్సు: మార్చి 31 నాటికి 28 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టుకు రూ.47,868 జీతం ఉంటుంది. ఆపరేటర్ ఉద్యోగానికి రూ.45,852 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.hal-india.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టుకు రూ.47,868 జీతం ఉంటుంది. ఆపరేటర్ ఉద్యోగానికి రూ.45,852 జీతం ఉంటుంది. మరి ఇంకెందకు ఆలస్యం అభ్యర్థుల్లారా.. వెంటనే జాబ్ కి అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 98
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 18
ఇది కూడా చదవండి: CBHFL Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలివే..
ఇది కూడా చదవండి: NGT Recruitment: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. రేపే లాస్ట్ డేట్