Big Stories

PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ..ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని అన్నారు.

- Advertisement -

బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై రాహుల్ మాట్లాడటం లేదని ఆరోపించారు. గతంలో రాజులు, మహరాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ ఆరోపించారని తెలిపారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చన్నమ్మ వంటి వారిని కూడా రాహుల్ అవమానించారని అన్నారు. రాహుల్ నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్‌షాలు చేసిన దౌర్జన్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

Also Read:రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ అధికారంలో శాంతిభద్రతల క్షీణించాయని మోదీ ఆరోపించారు. బెంగళూరు కేఫ్ పేలుడు ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని విమర్శించారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడుగా కొట్టిపారేసిందని అన్నారు. వాయినాడ్ లో ఓట్లకోసం ఇదే కాంగ్రెస్ నిషేధిత టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో చేతులు కలిపిందని మోడీ విమర్శించారు. ఒక్క సీటులో గెలుపుకోసం టెర్రరిస్ట్ గ్రూపులకు కాంగ్రెస్ లొంగిపోయిందని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News