BigTV English

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. అర్హత ఇదే

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. అర్హత ఇదే

Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ/బీఎస్సీ, బీఈ/బీటెక్‌ , ఎంఈ/ఎంటెక్‌ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


గుజరాత్‌, వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న 330 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 330


బ్యాంక్ బరోడాలో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

డిప్యూటీ మేనేజర్: 22 పోస్టుల

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 18 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 300 పోస్టులు

వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్ట్‌ – మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌, ప్రొడక్ట్‌ – అకౌంట్‌ అగ్రిగేటర్‌, ఓన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌),  డిజిటల్‌ ప్రొడక్ట్‌ – పీఎఫ్‌ఎం, సీబీడీసీ, మొబైల్‌ బిజినెస్‌ అప్లికేషన్‌, సేల్స్‌ – డిజిటల్ లెండింగ్‌, ఎంఎస్‌ఎంఈ – సేల్స్‌, వెండర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌, గ్రూప్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ రిస్క్‌ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టెమ్, సైబర్ సెక్యూరిటీ రిస్క్/ ఫైనాన్స్/ రిస్క్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌/ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ / సైబర్ సెక్యూరిటీ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్)  పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు కు ప్రారంభ తేది: 2025 జులై 30

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్ట్ 19

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుంచి 40 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: విద్యార్హతలు, ఎక్స్ పీరియన్స్ బేస్ చేసుకుని జీతం ఉంటుంది. గౌరవప్రదమైన వేతనాలే ఉంటాయి..

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ బేస్ చేసుకుని దరఖాస్తు చేసుకుంటారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

వెకెన్సీల సంఖ్య: 330

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 19

ALSO READ: University of Hyderabad: గ్రేట్.. రూ.46లక్షల జీతంతో ఉద్యోగం.. ఇంకా 550 మందికి జాబ్స్..

Related News

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 జాబ్స్.. రూ.69,100 జీతం.. లాస్ట్ డేట్?

Indian Navy: ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,10,000 వేతనం

Big Stories

×