University of Hyderabad: హైదరాబాద్ యూనివర్సిటీలో ప్లేస్ మెంట్స్ పెద్ద ఎత్తున జరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), డెలాయిట్, ఒరాకిల్, ఇంటెల్, ఆక్సెంచర్, నోవార్టిస్, జనరల్ ఎలక్ట్రిక్ లాంటి కార్పొరేట్ కంపెనీలు ప్లేస్ మెంట్స్ నిర్వహించాయి. అలాగే అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ ప్రకాశ్ ఇన్‌స్టిట్యూట్ వంటి విద్యా సంస్థలు, అనలిటిక్స్, ఫైనాన్స్ కంపెనీలు కూడా రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నాయి. ఐటీ, అనలిటిక్స్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, రీసెర్చ్ వంటి విభిన్న రంగాల్లో విద్యార్థులు కెరీర్‌ను ఎంచుకున్నారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ ప్లేస్ మెంట్స్ లో చాలా స్టూడెంట్స్ కు ఉద్యోగాలు వరించాయి. ఈ సారి ఓ ఎంటెక్ స్టూడెంట్ రూ. 46 లక్షల వార్షిక ప్యాకేజీని సాధించాడు. గడిచిన ఏడాది హైయెస్ట్ ప్యాకేజీ రూ.17.89లక్షలు.. గత సంవత్సరంతో పోల్చితే సారి టాప్ ప్యాకేజ్ రెట్టింపు కంటే ఎక్కువ. మొత్తం 550 మంది స్టూడెంట్స్ 180 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీ పెరుగుతున్న ఖ్యాతిని తెలియజేస్తోంది.
ALSO READ: Jobs in CCRAS: టెన్త్, ఇంటర్ పాసైతే ఉద్యోగం మీదే బ్రో.. జీతమైతే అక్షరాల రూ.39,100
ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ గైడెన్స్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగాలు కొరత ఉన్నప్పటికీ.. తమ ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్ టీమ్, పూర్వ విద్యార్థుల సంయుక్త కృషితో ఈసారి చాలా మందికి ఉద్యోగాలు దక్కాయని అన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ ప్రేరణ అఖౌరి మాట్లాడుతూ.. జూమ్, గూగుల్ మీట్ ద్వారా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలకు జరిగాయని.. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూలు ఆలస్యమైనప్పటికీ, అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు, ఓపెన్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించామని చెప్పారు.
ALSO READ: CM Revanth Reddy: అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరిన్ని సంస్థలతో సహకరించాలని ఆశిస్తోంది. టాలెంట్ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి సంస్థలను ఆహ్వానం పలుకుతోంది. యూనివర్సిటీ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విద్యా నాణ్యత, విద్యార్థుల సామర్థ్యాలను ప్రపంచ స్థాయిలో ప్రదర్శిస్తుంది.