దసరా, దీపావళి పండగలు నేపథ్యంలో బోలెడు ఆఫర్లను ప్రకటిస్తాయి ఆయా సంస్థలు. ఆటో మోబైల్ నుంచి మొబైల్ కంపెనీల వరకు, రిలయన్స్ మార్ట్ నుంచి డిమార్ట్ వరకు పండుగ సందర్భంగా కొనుగోలు దారులకు క్రేజీ ఆఫర్లు అందిస్తాయి. నిత్యవసర సరుకులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి డిమార్ట్ తక్కువ ధరలకే అందిస్తోంది. ఇక్కడ పండుగ సామాన్లు కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పండుగ సీజన్ లో తక్కువ ధరలకు డిమార్ట్ లో ఎలా సరుకులను కొనుగోలు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా డిమార్ట్ లో నాణ్యమైన వస్తువలను తక్కువ ధరలకు పొందే అవకాశం ఉంటుంది. దేశ వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజలు డిమార్ట్ లో సరుకులు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇతర మార్ట్ లతో పోల్చితే ఇక్కడు తక్కువ ధరలకే కిరాణ సరుకులు, గృహోపకరణాలు అందుబాటులో ఉంటాయి. అందుకే, ఎప్పుడు చూసినా డిమార్ట్ కస్టమర్లతో రద్దీగా కనిపిస్తుంది. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలో వస్తువులను అందిస్తుండటంతో డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వారు డిమార్ట్ లోనే షాపింగ్ చేస్తారు. పోటీ సంస్థలకు ఏమాత్రం సాధ్యంకాని రీతిలో డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంది. అందుకే, ఎక్కువ మందిని డిమార్ట్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. వినాయక చవితి సందర్భంగా డిమార్ట్ క్రేజీ ఆఫర్లు ప్రకటించింది. సగం ధరలకే పలు వస్తువులను అందించింది. దసరా, దీపావళికి కూడా అవే ఆఫర్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక వీకెండ్స్ తో పాటు పండుగల సమయంలో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు అందిస్తుంది. బైవన్ గెట్ వన్ ఫ్రీ, సహా పెద్ద మొత్తంలో తగ్గింపు ధరలకు సరుకులను అందుబాటులో ఉంచుతుంది. కొన్ని సందర్భంగా వీకెండ్స్ కాకుండా మిడ్ వీక్ లో కూడా ఆఫర్లు అందిస్తుంది. కొన్నిసార్లు పాత సరుకు అంతా ఖాళీ చేసేందుకు మంచి ఆఫర్లు అందిస్తుంది. అయితే, మరీ ఎక్కువ తగ్గింపు అందిస్తున్న సమయంలో వాటి గడువు తేదీలను క్రాస్ చెక్ చేయాలి. మరీ ఎక్స్ పైయిరీ డేట్ దగ్గరలో ఉంటే తీసుకోకూడదు. క్వాలిటీ విషయాన్ని కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి.
Read Also:ఆ వస్తువులు సగం ధరలకే, డిమార్ట్ వినాయక చవితి బంపర్ ఆఫర్!
పండుగల సందర్భంగా నిత్యవసర సరుకుల నుంచి గృహోపకరణాల వరకు ఇందులో అగ్గువకు లభిస్తాయి. ఈ సంస్థ పెద్ద లేబుల్స్ తో పాటు సొంత బ్రాండ్ ఉత్పత్తులను కలిగి ఉంది. వీటిలో కిరాణా సామాన్లు అయిన బియ్యం, పప్పు, నూనెలతో పాటు స్నాక్స్, శుభ్రపరిచే లిక్విడ్స్, దుస్తులను ప్రీమియా, అలైన్ రిటైల్ పేరుతో అందుబాటులో ఉంచింది. అమూల్, బ్రిటానియా, కోల్గేట్ లాంటి పెద్ద బ్రాండ్లకు అదనంగా చెల్లించకుండా నేరుగా ఉత్పత్తులను తయారు చేయడం, సోర్సింగ్ చేయడం ద్వారా వినియోగదారుల ఖర్చులు తగ్గించడంలో సాయపడుతుంది. డిమార్ట్ ప్రతి వస్తువుపై ఎమ్మార్పీ మీద 3-10% తగ్గింపును అందిస్తుంది. బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్ లాంటి వాటితో పోల్చితే తక్కువ ధరలకే అందిస్తుంది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?