BigTV English

NPCIL Jobs: ఐటీఐ, డిగ్రీ అర్హతతో 337 ఉద్యోగాలు.. అప్లై చేస్తే జాబ్.. చివరి తేది ఇదే..

NPCIL Jobs: ఐటీఐ, డిగ్రీ అర్హతతో 337 ఉద్యోగాలు.. అప్లై చేస్తే జాబ్.. చివరి తేది ఇదే..

NPCIL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ ట్రేడ్ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసైన వారు ఈ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హతలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


తమిళనాడు, కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ (KKNPP) లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 337 అప్రెంటిస్‌ల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 337


ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ట్రేడీ అప్రెంటీస్,  ట్రేడ్ అప్రెంటిస్‌, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు వివరాలు: 

ట్రేడ్ అప్రెంటీస్‌లు : 122 పోస్టులు

డిప్లొమా అప్రెంటిస్‌లు: 94 పోస్టులు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: 121 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్స్ డిగ్రీ పాసై ఉండాలి. అల్రెడీ అప్రెంటీస్ షిప్ శిక్షణ పొందిన అభ్యర్థులు అర్హులు కాలేరు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 31

వయస్సు: పోస్టును బట్టి వయస్సును నిర్ధారించారు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 14 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

స్టైఫండ్: ఉద్యోగాన్ని బట్టి స్టైఫండ్ ను నిర్ణయించారు. నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ.7700 – రూ.8050, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000 స్టైఫండ్ ఉంటుంది.

పోస్టు ఎంపిక విధానం: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో పొందిన మార్కులను బేస్ చేసుకుని ఎంపిక చేస్తారు. స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యంత ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారంను  సీనియర్ మేనేజర్, కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్, ఎన్‌పీసీఐఎల్‌,  కుడంకుళం పీఓ, రాధాపురం తాలూకా, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు చిరునామాకు పంపించాలి. ట్రేడ్ అప్రెంటిస్‌ అభ్యర్థులు NAPS పోర్టల్‌లో.. డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు NATS పోర్టల్‌లో.. నమోదు చేసుకోవాలి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://npcil.nic.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం వెకెన్సీల సంఖ్య: 337

దరఖాస్తుకు చివరి తేది: జులై 31

ALSO READ: Coast Guard Jobs: కోస్ట్‌గార్డులో ఉద్యోగాలు.. లక్షకు పైగా వేతనం.. ఇంకా 3 రోజులే సమయం

Related News

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా

AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు

Big Stories

×